అమరావతిలో అడుగుపెట్టనే లేదట

వాళ్లు వైఎస్ జగన్ ను అడగలేకపోతున్నారట. తనంతట తానుగా జగన్ పిలిచి పదవి ఇస్తేనే తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే అమరావతి కూడా రావడంలేదట. వైసీీపీ అధికారంలోకి వచ్చి రెండు [more]

Update: 2019-08-10 05:00 GMT

వాళ్లు వైఎస్ జగన్ ను అడగలేకపోతున్నారట. తనంతట తానుగా జగన్ పిలిచి పదవి ఇస్తేనే తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే అమరావతి కూడా రావడంలేదట. వైసీీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడిచింది. ఇంకా కొందరు నేతలు అమరావతికి రాలేదు. జగన్ ను కలిసేందుకు కూడా వారు రాలేదు. ఎందుకంటే చివరి నిమిషంలో పార్టీకి రావడమే వారు చేసిన తప్పిదంగా చెబుతున్నారు.

లాస్ట్ మినిట్ లో చేరి….

నిజానికి ఎన్నికలకు ముందు చేరికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి హైప్ వచ్చింది. కిల్లి కృపారాణి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి వారు లాస్ట్ మినిట్ లో పార్టీలో చేరారు. వీరిలో మాగుంట, ఆదాలకు జగన్ ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. వారిద్దరూ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. కిల్లి కృపారాణికి టిక్కెట్ ఇవ్వకపోయినా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా పదవులు ఆశిస్తున్నారు.

ఎస్వీకి అవకాశమే లేదు….

ఇక గతంలో వైసీపీలో ఉండి మధ్యలో జంప్ చేసి చివరి నిమిషంలో తిరిగి వైసీపీలో చేరిన ఇద్దరి నేతల పరిస్థిితి మాత్రం అయోమయంగా కనపడుతోంది. వారే బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి. ఎస్వీ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన తర్వాత టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఆయన తిరిగి వైసీీపీలో చేరారు. కర్నూలులో వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు.

బుట్టా రేణుక ఆశ…

కర్నూలు ఎంపీగా 2014లో వైసీపీ తరుపున గెలిచిన బుట్టా రేణుకది కూడా సేమ్ సిట్యూయేషన్. టీడీపీలో చేరి టిక్కెట్ రాక బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. అయితే వీరిద్దరూ ఇప్పటి వరకూ అమరావతికి రాలేదట. వీరిలో బుట్టా రేణుక మాత్రం జగన్ తనకు ఏదో ఒక అవకాశం ఇస్తారని నమ్ముతున్నారు. తాను చేసిన తప్పును తెలుసుకుని వచ్చాను కనుక ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవిని జగన్ ఇస్తారని బుట్టారేణుక నమ్ముతున్నారు. సామాజికవర్గాల పరంగా బుట్టారేణుకకు పదవి వచ్చే అవకాశం ఉన్నా ఆమె నేరుగా జగన్ అడిగే అవకాశంలేదు. ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే ఆ అవకాశం కూడా లేదు. జగన్ నుంచి పిలుపు వచ్చే వరకూ వెయిట్ చేయడం తప్ప వారు చేయగలిగిందేమీ లేదు. అందుకే ఇప్పటి వరకూ అమరావతిలో అడుగుపెట్ట లేదట ఇద్దరు నేతలు.

Tags:    

Similar News