తస్సాదియ్యా.. బాబంటే బాబే.. ఇంకా తోకలు కత్తిరిస్తారట..!
చింతచచ్చినా పులుపు చావదనే సామెత.. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమవుతోందా ? ఆయన ఇప్పటికీ ఇంకాదూకుడు తగ్గించలేదా ? ఒంటెత్తు పోకడలతోనే ముందుకు సాగుతున్నారా ? [more]
చింతచచ్చినా పులుపు చావదనే సామెత.. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమవుతోందా ? ఆయన ఇప్పటికీ ఇంకాదూకుడు తగ్గించలేదా ? ఒంటెత్తు పోకడలతోనే ముందుకు సాగుతున్నారా ? [more]
చింతచచ్చినా పులుపు చావదనే సామెత.. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమవుతోందా ? ఆయన ఇప్పటికీ ఇంకాదూకుడు తగ్గించలేదా ? ఒంటెత్తు పోకడలతోనే ముందుకు సాగుతున్నారా ? అంటే.. ఔననే అంటున్నాయి.. తాజా పరిస్థితులు గమనించిన తర్వాత.. పరిశీలకుల మాటలు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్ని పరిణామాలపై ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వంటివారు ప్రతిపక్షం కుట్రలతో ప్రభుత్వం ఏమీ చేయలేక పోతోందని, ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండడుగులు వెనక్కి వేయాల్సి వస్తోందని వాపోయారు.
అన్నింటా విమర్శలే…..
నిజానికి మంత్రుల ఆవేదనలో అర్ధం ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా.. ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా ప్రతిపక్షంగా చంద్రబాబు సలహాలు, సూచనలు చేయడం మానేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కొన్ని సంక్షేమ పథకాలతో పాటు గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థకు సామాన్య ప్రజల నుంచి మంచి మార్కులే పడ్డాయి. వీటిల్లో ఏ ఒక్కదానికి బాబు నుంచి ప్రశంసలే లేవు.
పేరు మార్చి అమలు చేస్తున్నారంటూ….
ఇటీవల డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని అమలు చేస్తే.. ఇది మాదే.. మేమే ఇంతకన్నా ఘనంగా అమలు చేశాం. దీనికి పేరు మార్చిన జగన్.. ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నారు.. అని చెప్పుకొచ్చారు. ఇక, రాజధాని విషయంలోనూ ఇలానే వ్యవహరించి.. ప్రభుత్వంపై బెడ్డలు వేసే పని పెట్టుకున్నారు. ఆయా అంశాల్లో చిర్రెత్తుకొచ్చిన మంత్రులు చంద్రబాబును తాజాగా ఉతికి ఆరేశారు. దీంతో చంద్రబాబు వెంటనే వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. లేదా.. తాను చెప్పిన విషయాలను సమర్ధించుకునే ప్రయత్నమైనా చేసి ఉండాలి.
మార్పు కన్పించడం లేదని…..
కానీ, ఆయన ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఉద్దేశించి.. తాట తీస్తా.. తోలు తీస్తా.. అంటూ.. వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారులను కూడా ఇలానే బెదిరించారు. పనిచేయకపోతే.. తాట తీస్తా అన్నారు. ఇక, చివరకు ప్రజలే ఆయనకు తాట తీసి పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా చంద్రబాబులో ఎక్కడా మార్పు అనేది కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.