ఆపుతారా? వదిలించుకుంటారా?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ప్రధాన ప్రతి [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ప్రధాన ప్రతి [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ప్రధాన ప్రతి పక్షం టీడీపీ పరిస్థితి ఊగిసలాటగా ఉందని చెబుతున్నారు. నాయకుడి విధానాలను, ఆయన వ్యూహాలను తప్పుపట్టేవారు పెరుగుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు, మాజీ కేంద్ర మంత్రులు వచ్చి.. చంద్రబాబుకు జై కొట్టారు. వీరిలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులు, పనబాక లక్ష్మి దంపతులు, కిశోర్ చంద్రదేవ్ ఫ్యామిలీ సహా 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన వారు ఉన్నారు.
పార్టీలో గుర్తింపు లేక…..
అయితే, ప్రస్తుతం వీరికి పార్టీలో పెద్దగా పనిలేకుండా పోయింది. టీడీపీలో సంస్థాగతంగా ఉన్నవారిదే హవా కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పనిలేకుండా పోయింది. అసలు వీళ్లు టీడీపీలో ఉన్నారా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని గమనిస్తున్న సీనియర్లు.. ఇక, పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే వాదనను తెరమీదికి తెస్తున్నారు. అలాగని ఇప్పుడున్న పార్టీల్లోకి అంటే.. జనసేన, బీజేపీ, వైసీపీల్లోకి చేరే ఉద్దేశం కూడా లేదు. పోనీ, రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుందామా? అంటే ఆ పని కూడా చేయలేరు.
బీజేపీ వ్యతిరేక గాలులతో….
ఈ నేపథ్యంలోనే వారు తమ పాతగూడు బాగుపడితే.. అక్కడికే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఎప్పటి నుంచో తెలియవస్తోంది. అంటే గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారు ఇప్పుడు టీడీపీ ఉండడంతో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటే, ఆ పార్టీ లోకి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు వీరు అనుకున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ చీఫ్ మారడం, దేశంలోనూ తిరిగి రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడిగా వచ్చే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అదేసమయంలో బీజేపీకి, మోడీకి తీవ్రమైన వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.
వదిలించుకుంటారా?
ఈ క్రమంలో ప్రజలకు ఉన్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. ఇక, ఏపీలోనూ వైసీపీని ఎదిరించే పార్టీ అంటూ ప్రస్తుతానికి ఏదీలేకుండా పోయింది. ఈ పర్యవసానాల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశలు కొందరిలో ఉన్నాయి. దీంతో పాతకాపులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే. టీడీపీలో ఉన్న కాంగ్రెస్ వాదులు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. మరి చంద్రబాబు వీరిని అడ్డుకుంటారో.. లేక పోతే పోనీ అని వదిలించుకుంటారో చూడాలి.