బెట్టింగ్ బంగార్రాజుల పంట పండిందే…!!

కోడి పందాలు వేస్తే తాట తీస్తాం అన్నారు ఖాకీలు. కానీ ఏపీలో ప్రతిపల్లె కోడిపందాల నిర్వహణలో పోటీ పడిమరీ పండగ జరిపాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాప్రతినిధులు [more]

Update: 2019-01-18 00:30 GMT

కోడి పందాలు వేస్తే తాట తీస్తాం అన్నారు ఖాకీలు. కానీ ఏపీలో ప్రతిపల్లె కోడిపందాల నిర్వహణలో పోటీ పడిమరీ పండగ జరిపాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులను వెనక్కి తగ్గాలని చెప్పేశారు. కొన్ని చోట్ల ఖాకీ టాక్స్ కట్టి మరీ అధికారికంగా పందాలు ధైర్యంగా నిర్వహించారు నిర్వాహకులు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి కోడిపందేలకు హైటెక్ హంగులు అద్దారు. డ్రోన్ కెమెరాలు, ఆరు పాయింట్లలలో స్టాండ్ కెమెరాలు పెట్టి ఎల్ ఈ డి స్క్రీన్స్ సైతం ఏర్పాటు చేసి ఔరా అనిపించారు.

ప్రత్యేక అతిధి మర్యాదలు …

పండగకు వచ్చే అల్లుళ్లకు మర్యాదలు సక్రమంగా జరిగాయో లేదో కానీ పందెం రాయుళ్ళకు సకల ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వారికోసం తాత్కాలిక ఫుడ్ కోర్ట్ లు, బార్లు అక్కడికక్కడే ఏర్పాటు చేశారు. ఇక అతిధులకు వారి స్థాయిని బట్టి లాడ్జీలలో రూంలు సైతం బుక్ చేసేశారు. కోడిపందాలకు తోడు గుండాట, పేకాట శిబిరాలు పక్కపక్కనే ఏర్పాటు అయిపోయాయి. భోగి పండగకు ముందు నుంచి మొదలైన సందడి కనుమ ముగిసినా కొనసాగింది. ఈ పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి.

గతంలో ఇదే తీరులో …

ఎపి పల్లెల్లో వున్న ఈ సంప్రదాయాన్ని టిడిపి సర్కార్ 2014 లో అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికం చేసి పర్యాటక రంగ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలన్న ఆలోచన చేసింది. అయితే ప్రజాసంఘాలు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తరువాత నాలుగేళ్ళు ఇప్పుడు జరిగినంత బాహాటంగా కోడిపందాలు సాగకపోయినా ఈ సంవత్సరం విచ్చలవిడిగా పోటీలు జరిగిన తీరు మాయని మచ్చగా మిగులుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News