దిద్దుబాట పట్టిన కాంగ్రెస్ .. ఫలితం ఉంటుందా?

కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లకు మేలుకుంది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటోంది. దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండేది. ఇందిర పుణ్యమా [more]

Update: 2021-04-27 18:29 GMT

కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లకు మేలుకుంది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటోంది. దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండేది. ఇందిర పుణ్యమా అని దక్కిన ఓటు బ్యాంకు క్రమంగా చేజారిపోతూ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయి బలమైన నేతలు ప్రాంతీయ పార్టీలు పెట్టడమూ ఇందుకు ఒక కారణంగా చెప్పాలి. కాంగ్రెస్ నాయకత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనమయిపోయింది.

అన్ని రాష్ట్రాల్లో….

పార్టీలో ఉన్న బలమైన నాయకత్వాన్ని గుర్తించకపోవడం, భజన బ్యాచ్ ను చేరదీయడం, ముఖ్యమంత్రి ఎవరో ఢిల్లీలో నిర్ణయించడం వంటి కారణాలు ఆ పార్టీని బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. శరద్ పవర్ నుంచి ఏపీలో వైఎస్ జగన్ వరకూ కాంగ్రెస్ ను వీడిపోయి సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోల్పోవాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వచ్చింది.

మీడియా లేకపోవడంతో…..

కాంగ్రెస్ రాష్ట్రాల్లో బలహీనం కావడంతో బీజేపీకి వరంగా మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ వ్యూహాలను మార్చుకుంది. కాంగ్రెస్ మాత్రం పాత పద్ధతిలోనే వెళుతుంది. బీజేపీకి బలమైన మీడియా ఉండటంతో పబ్లిసిటీ కొరత లేదు. కాంగ్రెస్ పదేళ్ల పాటు పాలించినా, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అనేక సంస్కరణలు జరిగినా అవినీతి మాత్రమే హైలెట్ అయింది. సోషల్ మీడియాలో సయితం కాంగ్రెస్ వీక్ గానే ఉంది.

సొంత మీడియాతో…..

ఈ కారణాలతోనే కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. అయితే ఈలోపాన్ని గుర్తించిన అధినాయకత్వం తమకు కూడా డిజిటల్ ప్లాట్ ఫారం ఉండాలని గుర్తించింది. పార్టీ కోసం ఐ.ఎన్.సి టీవీని ప్రారంభించబోతుంది. ఈ ఛానల్ ద్వారా తమ పార్టీ సిద్దాంతాలను, తాము చేసిన అభివృద్ధి పనులను వివరించనున్నారు. తొలుత ఇంగ్లీష‌, హిందీ భాషల్లో వస్తున్న ఈ ఛానల్ క్రమంగా అన్ని భాషల్లో విస్తరించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తాను వెనకబడి పోవడానికి గత కారణాలను గుర్తించి దిద్దుబాటు యత్నాలను ప్రారంభించింది

Tags:    

Similar News