బీజేపీని చూసైనా నేర్చుకోరా? ఇంత జరుగుతున్నా?
రాజకీయాల్లో బీజేపీ విధానాలే ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిణామాలను చూసిన తర్వాత బీజేపీ నియమ, నిబంధనలను అన్ని పార్టీలూ భవిష్యత్ లో అనుసరించక [more]
రాజకీయాల్లో బీజేపీ విధానాలే ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిణామాలను చూసిన తర్వాత బీజేపీ నియమ, నిబంధనలను అన్ని పార్టీలూ భవిష్యత్ లో అనుసరించక [more]
రాజకీయాల్లో బీజేపీ విధానాలే ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిణామాలను చూసిన తర్వాత బీజేపీ నియమ, నిబంధనలను అన్ని పార్టీలూ భవిష్యత్ లో అనుసరించక తప్పదంటున్నారు. భారతీయ జనతా పార్టీలో 70 ఏళ్ల వయసు దాటితే పదవులకు దూరంగా ఉంచుతారు. కనీసం టిక్కెట్ కూడా ఇవ్వరు. అదే ఆ పార్టీలో అసంతృప్తి తలెత్తకుండా కాపాడుతుందన్న వ్యాఖ్యలు ప్రస్తుత జరుగుతున్న పరిణామాలను చూసి అభప్రాయం వ్యక్తమవుతోంది.
సీనియర్ నేతలు ఎవరినైనా….?
ఎల్ కె అద్వాని లాంటి నేతలకే ఈ నిబంధనలను అమలు పర్చారు. సుమిత్రామహాజన్ లాంటి వారికి కూడా వయసు కారణంచూపి టిక్కెట్ గత ఎన్నికల్లో ఇవ్వలేదు. ఇలా అనేక రాష్ట్రాల్లో 70 దాటిన వారిని భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టింది. కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి వారికి మాత్రం కొంత మినహాయింపులు ఇచ్చింది. దీంతో అక్కడ కూడా ఆయన పై అసంతృప్తులు బయలుదేరిన విషయం తెలిసిందే.
మరి కాంగ్రెస్ లో…..
కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే వృద్ధతరం నేతలే ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పటి వరకూ ఇంట్లో ఉన్న సీనియర్ నేతలు సయితం ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ కొంపముంచుతోంది. రాష్ట్రాలతో పాటు నాయకులను కూడా కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలను పరిశీలించిన వారికి ఎవరైనా 70 ఏళ్ల వయసు రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ ఇవ్వక తప్పదన్నది అర్థమవుతోంది.
ఇప్పటికీ పదవులన్నీ…..
కేవలం ముఖ్యమంత్రి పదవులే కాదు. అన్ని కీలక పదవులు కూడా సీనియర్లకే దక్కుతున్నాయి. పార్లమెంటులో ఓటమి పాలయిన వారికి కూడా రాజ్యసభకు పంపుతున్నారు. కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలను రాజ్యసభకు ఎంపిక చేయడంపై ఆయా రాష్ట్రాల్లోని పార్టీలో అసంతృప్తి వ్యక్తమయినా హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కూడా బీజేపీ బాట పట్టకుంటే భవిష్యత్తులో యువనాయకత్వం పార్టీలో కనుమరుగవుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.