ఆఖరి ఘడియలేనా…??
కర్ణాటక సంకీర్ణ సర్కార్ కు ఆఖరి ఘడియలు సమీపించినట్లున్నాయి. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనసపడటం, ఇటీవల జరిగిన [more]
కర్ణాటక సంకీర్ణ సర్కార్ కు ఆఖరి ఘడియలు సమీపించినట్లున్నాయి. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనసపడటం, ఇటీవల జరిగిన [more]
కర్ణాటక సంకీర్ణ సర్కార్ కు ఆఖరి ఘడియలు సమీపించినట్లున్నాయి. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనసపడటం, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికలపడటంతో ఇక పార్టీలో ఉండటం వేస్ట్ అన్న భావనకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్ఖిహోళి, ఆనంద్ సింగ్ లు ఎమ్మెల్యేల పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. వారి బాటలో మరికొంత మంది పయనించే అవకాశముందంటున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే….
ప్రధానంగా సంకీర్ణ సర్కార్ ఏర్పడిన నాటి నుంచే కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. అయితే లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను ఈ విషయంలో కట్టడి చేసింది. లోక్ సభ ఎన్నికల అనంతరం కూడా వారంతట వారుగా రాజీనామాలు చేసి వస్తే అభ్యంతరం లేదని అధిష్టానం చెబుతూ వస్తోంది. దీంతో యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేసే దిశగా ప్రయత్నాలు గత కొద్ది రోజుల నుంచి ప్రారంభించారు.
బీజేపీ హస్తం ఉందంటూ…
మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ లో అసమ్మతి కుంపట్లు చల్లారతాయని భావించినా అది సాధ్యం కాలేదు. తొలి నుంచి అసంతృప్తి వాదిగా ముద్రపడిన రమేష్ జార్ఖిహోళి రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది. రమేష్ జార్ఖిహోళికి దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు సన్నిహితంగా ఉంటుండటంతో పార్టీలో కొంత కలవరం బయలుదేరింది. మరో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా వెనక కూడా బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
రంగంలోకి దిగినా….
దీంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమయింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అసంతృప్తిగా ముద్రపడిన ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడారు. వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఇద్దరు శాసనసభ్యులు రాజీనామాతో కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ బలం 117కు పడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ కూడా నేరుగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉండటంతో ఈ సంఘటనలు చోటు చేసకోవడంతో దేవెగౌడ కూడా రంగంలోకి దిగారు.