ఈ ఎమ్మెల్యేపై సొంతపార్టీలోనే అసంతృప్తి.. రీజనేంటి?
అనంతపురం జిల్లాలో కీలకమైన కల్యాణదుర్గం నియోజకవర్గంలో తొలిసారి విజయం సాధించిన వైసీపీ పట్టు సాధించలేక పోతోందా ? ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోతోందా ? దీనికి [more]
అనంతపురం జిల్లాలో కీలకమైన కల్యాణదుర్గం నియోజకవర్గంలో తొలిసారి విజయం సాధించిన వైసీపీ పట్టు సాధించలేక పోతోందా ? ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోతోందా ? దీనికి [more]
అనంతపురం జిల్లాలో కీలకమైన కల్యాణదుర్గం నియోజకవర్గంలో తొలిసారి విజయం సాధించిన వైసీపీ పట్టు సాధించలేక పోతోందా ? ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోతోందా ? దీనికి ఆ పార్టీ ఎమ్మెల్యేనే కారణమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కల్యాణ దుర్గం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. గట్టి పట్టున్న నాయకులు ఇక్కడ ఆ పార్టీకి అండగా ఉన్నారు. ఇంతటి బలంగా ఉన్న టీడీపీని సైతం గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఉషశ్రీ చరణ్ ఓడించి.. గెలుపు గుర్రం ఎక్కారు.
టీడీపీ విభేదాలే……..
అయితే, ఉషశ్రీ చరణ్ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఆమె సొంత బలం కన్నా కూడా జగన్ సునామీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అదే సమయంలో టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడులు టికెట్ కోసం ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉమా మహేశ్వరనాయుడుకు టికెట్ ఇచ్చారు. దీంతో ఉన్నం ఆయనకు సహకరించలేదనే టాక్ ఉంది. ఈ టీడీపీ అంతర్గత విభేదాలు కూడా ఉషశ్రీ చరణ్ కి కలిసి వచ్చాయి. మొత్తానికి టీడీపీ కంచుకోటలో పాగా అయితే వేశారు. మరి ఈ క్రమంలో పార్టీని, తన దూకుడు స్థిరం చేసుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
బెంగళూరులోనే మకాం….
కురబ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ ని జగన్ ఏరికోరి తెచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. అయితే, ఆమె గెలిచిన తర్వాత బెంగళూరుకే పరమితమయ్యారనే వాదన ఉంది. ఆమె బెంగళూరులో మకాం ఉంటూ అసలు నియోజకవర్గంలోకి అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే వస్తున్నారన్న సెటైర్లు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. పైగా ఆమెకు తెలుగుపై పట్టులేదు. దీంతో నియోజకవర్గంలో ప్రజలకు కూడా లింక్ కాలేక పోతున్నారు. పైగా కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించడం లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో వచ్చి.. విజయవాడలోనే ఉంటూ.. మమ అనిపిస్తున్నారు. దీంతో నియోజకవర్గానికి ఆమెకు మధ్య దూరం పెరిగిపోయింది.
సమస్యల పరిష్కారంపై…..
ఇక, కొందరు కార్యకర్తలను ఉషశ్రీ చరణ్ అక్కడ నియమించి పరిస్థితులను తాను తెలుసుకుంటున్నా.. సమస్యల పరిష్కారంపై మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ఆమె చుట్టూ ఉన్న కోటరీ వల్ల కూడా ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికి ఆమె గెలిచి ఏడాదిన్నర పూర్తయినా.. ఏ కార్యక్రమం చేపట్టలేదు. దీనిని టీడీపీ నాయకులు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. టీడీపీ బలమైన నియోజకవర్గంలో వారి దూకుడు ఇప్పుడు మరింతగా పెరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సీన్ రివర్స్ అయితే….?
ప్రభుత్వ పథకాలు కూడా వలంటీర్లు.. దిగువస్థాయి నేతలు నిర్ణయించినట్టుగానే ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ఓట్లేసి తప్పు చేశామా? అనే అంతర్మథనం కూడా ఇక్కడి ప్రజల్లో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓడిన ఉమామహేశ్వర నాయుడు పార్టీని పటిష్టం చేసుకుంటూ, స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటూ దూసుకుపోతున్నారు. ఈ పరిస్థితి కంటిన్యూ అయితే ఇక్కడ వైసీపీ సీన్ రివర్స్ అవ్వడానికి ఎంతో సమయం పట్టేలా లేదు.