ఇద్దరిలోనూ అసహనమే? ఎవరిది విజయం?
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు. ఆయనను ఎట్టకేలకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. అదే సమయంలో మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను [more]
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు. ఆయనను ఎట్టకేలకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. అదే సమయంలో మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను [more]
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు. ఆయనను ఎట్టకేలకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. అదే సమయంలో మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను అధిష్టానం నియమించింది. ఇక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సయితం డీకే శివకుమార్ కు పీసీసీ పదవి దక్కకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అయినట్లు? అందరినీ సంతృప్తి పర్చేలా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఉందా?
డీకే ను నియమించడంతో….
కర్ణాటకలో ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ నియమితులయ్యారు. దాదాపు రెండు నెలలుగా పీసీసీ చీఫ్ పదవి నియామకం జరగలేదు. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దినేష్ గుండూరావు రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే డీకే శివకుమార్ పేరు వినపడుతూ వస్తుంది. అయితే అనేక మంది డీకే అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలిపారు.
సిద్ధూ అభ్యంతరం….
అసలు అధికారం కోల్పోవడానికి డీకే శివకుమార్ కారణమని అనేక మంది హైకమాండ్ కు చెప్పారు. డీకే శివకుమార్ కు, రమేష్ జార్ఖిహోళికి మధ్య తేడా రావడంతోనే సంకీర్ణ సర్కార్ కుప్పకూలిపోయందని ఫిర్యాదు చేశారు. మరోవైపు సిద్ధరామయ్య సయితం డీకే శివకుమార్ అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరం తెలిపారు. ఒకవేళ డీకే శివకుమార్ కు పదవి ఇవ్వదలిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని కూడా సిద్ధరామయ్య సిఫార్సు చేశారు.
నిర్ణయంపై ఇద్దరూ….
కానీ ఇద్దరినీ సంతృప్తి పర్చేలా హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. కానీ హైకమాండ్ నిర్ణయంతో ఇటు డీకే శివకుమార్ సంతృప్తి కరంగా లేరు. తనకు పూర్తి స్థాయి అధికారాలివ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిచండమేంటన్న అసహనంతో ఉన్నారు. ఇక సిద్ధరామయ్య విషయం సరేసరి. ఆయన డీకే నియామకం పట్ల అసంతృప్తితో ఉన్నారు. డీకే, సిద్ధరామయ్య వర్గాలు కలసి పనిచేసే అవకాశాలున్నాయా? అన్నది అనుమానమే. మరి ఇద్దరు అగ్రనేతలు హైకమాండ్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కలసి వచ్చే అవకాశం లేదు.