డీకే వచ్చిన తర్వాత అంతా అనుకున్నట్లుగానే?

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్ అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే సీనియర్ నేతలను కలిశారు. వీరప్పమొయిలీ వంటి నేతలను కలసి [more]

Update: 2020-03-31 18:29 GMT

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్ అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే సీనియర్ నేతలను కలిశారు. వీరప్పమొయిలీ వంటి నేతలను కలసి తనకు సహకరించాల్సిందిగా ఆశీస్సులందుకున్నారు. అలాగే మిగిలిన నేతలను కలిసేందుకు ఆయన రెడీ అయిపోయారు. అందరం కలసి కట్టుగా కృషి చేస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని డీకే శివకుమార్ నేతలకు చెబుతున్నారు.

సీనియర్ నేతలు వ్యతిరేకించినా….

ఎన్నో వత్తిళ్ల మధ్య అధిష్టానం సయితం డీకే శివకుమార్ కు పీసీసీ చీఫ్ పగ్గాలను అప్పగించింది. ప్రధానంగా డీకే శివకుమార్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సయితం తన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. కానీ డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ అయితే తనను వెనక్కు నెడతారన్నది సిద్ధరామయ్య ఆందోళన. టిక్కెట్ల కేటాయింపు దగ్గర నుంచి ప్రచారం మొత్తం డీకే శివకుమార్ చేతిలోకి వెళుతుందన్నది ఆయనకు తెలుసు.

సిద్ధరామయ్య ఆలోచనలు వేరు….

వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను కుట్ర చేసి తమవైపునకు తిప్పుకుని అధికారంలోకి రావడంతో ఆ సానుభూతి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పనిచేస్తుందని సిద్ధరామయ్య అంచనా వేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. కానీ డీకే శివకుమార్ రాకతో ఒంటరిగా పోటీ చేసే విషయంపై కూడా సందిగ్దత నెలకొంటుంది.

జేడీఎస్ తో సయోధ్య దిశగా…..

డీకే శివకుమార్ జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామికి అత్యంత సన్నిహితుడు. సిద్ధరామయ్యకు కుమారస్వామికి శత్రువు. ఈ ఈక్వేషన్లతోనైనా కాంగ్రెస్, జేడీఎస్ లు వచ్చే ఎన్నికల్లో కలసి వెళ్లే అవకాశముంది. డీకే శివకుమార్ ను పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత కుమారస్వామి, దేవెగౌడ లు కొంత కాంగ్రెస్ పట్ల సానుకూల ధోరణితో కన్పిస్తున్నారు. సిద్ధరామయ్య కలసి రాకున్నా ఇతర నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని డీకే శివకుమార్ డిసైడ్ అయ్యారు. ఇది సిద్ధరామయ్యకు రుచించడం లేదు. ఇప్పటికైతే ఇద్దరి మధ్య కొంత సయోధ్య కన్పిస్తున్నా రాబోయే రోజుల్లో విభేదాలు తీవ్రమయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News