డీకే అలా వెళితేనే సక్సెస్ అవుతారా?

కర్ణాటకలో ఎన్నికలు మరో రెండున్నరేళ్లు ఉన్నా ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ [more]

Update: 2020-11-16 18:29 GMT

కర్ణాటకలో ఎన్నికలు మరో రెండున్నరేళ్లు ఉన్నా ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే చెప్పాలి. డీకే శివకుమార్ కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో బాధ్యతలను స్వీకరించారు. ఆయన పీసీసీ బాధ్యతలను స్వీకరించిన దగ్గర నుంచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు.

ఈడీ కేసులున్నా……

డీకే శివకుమార్ పై ఈడీ కేసులు ఉన్నప్పటికా ఆయన భయపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకు పడుతున్నారు. ఆయనపై జరిగినన్ని ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు మరే రాజకీయ నేత మీద జరగలేదంటే ఆశ్చర్యం లేదేమో. డీకే శివకుమార్ ఇప్పుడు పూర్తిగా పార్టీ బలోపేతం పైనే దృష్టి పెట్టారు. పార్టీ హైకమాండ్ కూడా డీకే శివకుమార్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో గతంలో జరిగిన తప్పులు పునరావృత్తం కాకుండా చూడాలని డీకే భావిస్తున్నారు.

పార్టీ వీడటంతోనే…..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 80కి పైగానే స్థానాలను దక్కించుకుంది. దీంతో తనకు అధిక స్థానాలు దక్కినా బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఇది నచ్చని కొందరు నేతలు పార్టీ మారడంతో అప్పటి సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. ఈసారి పూర్తిగా పార్టీ పట్ల నిబద్దత, విశ్వాసం ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని డీకే శివకుమార్ భావిస్తున్నారు.

ఈసారి ముందుగానే ……

వచ్చే ఎన్నికల నాటికి యడ్యూరప్ప నాయకత్వం ఉండకపోవచ్చు. దీంతో ప్రధానమైన లింగాయత్ సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదూసి రావడంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని డీకే శివకుమార్ అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని డీకే శివకుమార్ భావిస్తున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తొలుత అభ్యర్థులను ఎంపిక చేసి, వారిని యాక్టివేట్ చేయాలని డీకే శివకుమార్ ఆలోచనగా ఉంది. మరి డీకే ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News