దూకుడు మీదున్న డీకే…. అదే అసలు టార్గెట్
ఎస్ బంగారప్ప.. ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన కుటుంబం మాత్రం మొన్నటి వరకూ జనతాదళ్ ఎస్ లో ఉండేది. అయితే తాజాగా బంగారప్ప తనయుడు మధు బంగారప్ప [more]
ఎస్ బంగారప్ప.. ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన కుటుంబం మాత్రం మొన్నటి వరకూ జనతాదళ్ ఎస్ లో ఉండేది. అయితే తాజాగా బంగారప్ప తనయుడు మధు బంగారప్ప [more]
ఎస్ బంగారప్ప.. ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన కుటుంబం మాత్రం మొన్నటి వరకూ జనతాదళ్ ఎస్ లో ఉండేది. అయితే తాజాగా బంగారప్ప తనయుడు మధు బంగారప్ప కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన తండ్రిని ఆదరించిన పార్టీలో చేరారని మధు బంగారప్ప చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టిన తర్వాత పూర్తిగా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ఉప ఎన్నికలను పక్కన పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే డీకే శివకుమార్ సిద్ధమవుతున్నారు.
అందరినీ కలుపుకుని పోతూ…..
కర్ణాటకలో సిద్ధరామయ్య వంటి ప్రముఖ నేతలు తనకు అడ్డంకిగా మారుతున్నా డీకే శివకుమార్ అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను నమ్ముకున్న నేతలే ముంచారని, అధికారం కోల్పేయాల చేశారన్న సానుభూతి ప్రజల్లో ఉండటంతో ఈసారి అత్యధిక స్థానాలను ఒంటరిగా గెలుచుకునేందుకు డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక పిలుపు ఇస్తే….
ఇందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు కావడం పార్టీ బలోపేతంపై చర్చించడం చేస్తున్నారు. యడ్యూరప్ప ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరిగింది. ఒక పిలుపు ఇస్తే చాలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి.
ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం…..
ఇదే సమయంలో ఇతర పార్టీల నేతలను కూడా డీకే శివకుమార్ ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వస్తే భవిష్యత్ ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు మధు బంగారప్పను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన జేడీఎస్ లో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో శివమొగ్గ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనను చేర్చుకోవడం ద్వారా బలమైన సామాజికవర్గం అండగా ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ నుంచి కూడా కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద ఎన్నికలు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా డీకే శివకుమార్ మాత్రం దూకుడు పెంచారు.