Tdp : వలస నేతలు ఇక వాకిట బయటేనా?
తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం పెరిగిపోతుంది. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పార్టీ హైకమాండ్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి [more]
తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం పెరిగిపోతుంది. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పార్టీ హైకమాండ్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి [more]
తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం పెరిగిపోతుంది. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పార్టీ హైకమాండ్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని తొలి నుంచి ఉన్న నేతలే కాదు క్యాడర్ కూడా సహించలేకపోతుంది. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థిితి. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే వలస నేతలను పక్కన పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
సీనియర్లను కాదని….
సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. పార్టీ వలస నేతలకు పెద్దపీట వేస్తే కింది స్థాయి నుంచి అసంతృప్తి రగులుతుందని ఆయన అంటూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే అసంతృప్తి మొదలయింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వంటి సీనియర్ నేతలు అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే అధికారంలో ఉండటంతో చంద్రబాబు నేతలకు సర్దిచెప్పుకోగలిగారు.
వారికి ప్రాధాన్యత ఇచ్చి…
ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వలస నేతలకు టీడీపీ క్యాడర్ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరులో పెత్తనం అంతా ఇతర పార్టీల నుంచి వచ్చి అమర్ నాధ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అప్పగించడాన్ని అభ్యంతరం తెలుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమర్ నాధ్ రెడ్డికి మంత్రిపదవి, నల్లారికి నామినేట్ పదవి ఇచ్చినప్పటికీ వారు పార్టీని పట్టించుకోవడం లేదంటున్నారు.
జేసీ బ్రదర్స్ ను కూడా…
ఇక అనంతపురం జిల్లాలోనూ జేసీ బ్రదర్స్ ను దూరం పెట్టాలన్న డిమాండ్ పెరుగుతుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన జేసీ సోదరులకు పెత్తనం ఇస్తే ఊరుకోబోమని హైకమాండ్ కు హెచ్చరికలు కూడా వస్తున్నాయి. తొలి నుంచి టీడీపీలో ఉన్న నేతలంతా జేసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. చంద్రబాబు కూడా వీరి డిమాండ్ కు తలొగ్గక తప్పడంలేదు. చాలా రోజుల తర్వాత వలస నేతలపై పార్టీ లో తొలి నుంచి ఉంటున్న నేతలు అసహనం వ్యక్తం చేస్తుండటం టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారింది.