బతకాలా? బయటకు వెళ్లి చావాలా? బ్రెయిన్ లాక్ అయిందే?

పరిణామ క్రమంలో మనుగడ సాధించలేని జీవులు ప్రకృతి నుంచి అంతర్ధానమైపోతాయి. బలమైన జీవులు మనుగడ పోరాటంలో ముందుకు సాగిపోతాయి., బలహీనమైనవి మాయమైపోతాయి. మనుగడ సాధించే జీవులు ఉపయుక్తం [more]

Update: 2020-04-17 09:30 GMT

పరిణామ క్రమంలో మనుగడ సాధించలేని జీవులు ప్రకృతి నుంచి అంతర్ధానమైపోతాయి. బలమైన జీవులు మనుగడ పోరాటంలో ముందుకు సాగిపోతాయి., బలహీనమైనవి మాయమైపోతాయి. మనుగడ సాధించే జీవులు ఉపయుక్తం కాని అవయవాలను వదులుకుంటాయి. జిరాఫీకి పొడవైన మెడ., కోతి నుంచి పరిణామం చెందిన మనిషికి తోక లేకపోవడం వంటివి దీనికి ఉదాహరణలుగా చిన్నపుడు 8,9 జీవ శాస్త్ర్ర డార్విన్‌ పాఠాల్లో చదివిన జ్ఙాపకం.

భయపెట్టే మరణాలు….

ఈ లాక్‌డౌన్‌లు., ఇళ్లల్లో బందీఖానాలు., భయపెట్టే మరణాలు, ఎన్నాళ్లుంటుందో తెలియని సందిగ్ధత తర్వాత సడెన్‌గా ఈ పాఠం గుర్తుకు వచ్చింది. ఈ గొలుసును అంకుల్స్‌ ఎలా తెంపేస్తారా అన., చప్పట్లు., తప్పెట్లు, దీపాలు ఒకే….. మెదడును లాక్‌డౌన్‌లో పెట్టకపోవడం వల్ల ఏదో గందరగోళం? ఎప్పుడు బయటకు వెళతామో., తిన్నగా పనిచేసుకుంటామో., ఇదంతా ఎప్పటికి గాడిన పడుతుందో? ఈ లోపే తెలియకుండా అదేదో వైరస్‌ మన దగ్గర్లోకి వచ్చేస్తే? మనకు కావాల్సిన వాళ్లు., ఆప్తులు, కాదు కాదు మనమే దాని బారిన పడితే? మనం ఏమి చెప్పకుండా, చేయకుండా పోతే, ఇప్పుడు బతకాలా బయటకు వెళ్లి చావాలా? బతకాలంటే దాక్కోవాలా…? ఎవరు చావాలి., ఎవరు పోవాలి?

బలహీనమైన జీవులంటే?

బలహీనమైన లక్షణాలు కలిగిన జీవులంటే ఏ పూటకాపూట తిండి వెదుక్కునే వర్గమేనా? లేక తిన్నది అరగక రోడ్ల మీదకు వచ్చే వాళ్లా? బలమైన లక్షణాలు కలిగిన వాళ్లంటే ఇందాక డైయిరీలో పచ్చళ్లు కొంటూ “జానీ వాకర్‌ రెడ్‌ లేబుల్‌” కోసం ఫోన్‌లో ఎంక్వైరీ చేస్తున్నవాళ్లా? ఉపయుక్తం కాని జీవులంటే పేదలేనా? అదిగో పొట్లాలు పంచే బండి వెనుక పరిగెత్తే వాళ్లా? మనుగడ పోరాటం అంటే బతకడమా? ఇంట్లో దాక్కోవడమా? వచ్చే నెల ఎలా అని ఆలోచించడమా? ఈ వైరస్‌కి మందు ఇప్పట్లో రాకపోతే., ఈ గొలుసు ఇప్పుడప్పుడే తెగకపోతే., జీతాలు రాకపోతే…… బతుకు ఆగిపోతే….. అర్ధం పర్థం లేని సందేహాలు బోలెడు వస్తున్నాయి. ఉపయుక్తం కాని అవయవాలతో పాటు ఉపయుక్తం కాని ఆలోచనలు అంతర్ధానమైపోవడం ఎలాగో నేర్చుకుంటే బాగుండేది.

 

-శరత్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News