వికేంద్రీకరణే వైరస్ కట్టడికి మార్గమా?

కరోనా కట్టడికోసం ఢిల్లీ లో కూర్చుని పాలించేవారికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలియవు. అలాగే రాష్ట్ర రాజధానుల్లో ఉన్నవారికి జిల్లాల్లో పట్టణాలు, గ్రామాల్లో తీసుకోవాలిసిన చర్యలపై ఆలోచన [more]

Update: 2020-04-19 11:00 GMT

కరోనా కట్టడికోసం ఢిల్లీ లో కూర్చుని పాలించేవారికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలియవు. అలాగే రాష్ట్ర రాజధానుల్లో ఉన్నవారికి జిల్లాల్లో పట్టణాలు, గ్రామాల్లో తీసుకోవాలిసిన చర్యలపై ఆలోచన ఉండదు. దేశం మొత్తం యూనిట్ గా లేక రాష్ట్రం మొత్తం ఒకేలా చర్యలు తీసుకోవడం వల్ల ఫలితాలు ఆశించిన స్థాయిలో లభించవు అన్నది నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక అవసరాలు పరిస్థితులపై పట్టున్న జిల్లా యంత్రాంగాలు అక్కడి తీరును బట్టి నిర్ణయాలు తీసుకుని నిబంధనలు పెట్టడం లేదా తీసివేయడం జరగాలంటున్నారు.

గ్రామస్థాయి వరకూ…..

అధికార వికేంద్రీకరణ మండల గ్రామస్థాయి వరకు అప్పగించడమే మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు నిబంధనలు ఖచ్చితంగా పాటించే అవకాశాలు ఉంటాయని కేసుల తీరును బట్టి ప్రజల కు ఇచ్చే స్వేచ్ఛ ఆధారపడి ఉండేలా ఎప్పటికప్పుడు నియంత్రించే అవకాశం తో ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పట్టణానికి ఆ పట్టణం కట్టడికోసం శ్రమిస్తాయని సూచిస్తున్నారు.

ఆ జిల్లా యంత్రాంగాలే ఆదర్శం …

ఏపీ లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల లోని అధికార యంత్రాంగం పనితీరు అద్భుతంగా ఉంది. అక్కడి వారు తీసుకుంటున్న చర్యలు కరోనా లో ఒక్క పాజిటివ్ కేసు లేకుండా ఆ జిల్లాలను కాపాడుతున్నాయి. ఏపీ లో మిగిలిన జిల్లా యంత్రాంగాలు ఇదే తీరులో పనిచేస్తే వైరస్ వ్యాప్తికి మెరుగైన ఫలితాలు తధ్యమన్న మాట వినవస్తుంది. ప్రభుత్వం కూడా స్థానికంగా లాక్ డౌన్ కి సంబంధించి నిబంధనలు మార్చుకునే స్వేచ్ఛ కల్పిస్తే దేశవ్యాప్తంగా వేగవంతంగా మహమ్మారిని తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణుల వాదన.

మరింత అప్రమత్తత అవసరం…..

అయితే మొత్తం తామే అనే రీతిలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలి నడుస్తుంది. దాంతో కింది స్థాయి పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు లేక దీర్ఘ కాల లాక్ డౌన్ పర్యవసానంగా ప్రజలు రోడ్లపైకి యథేచ్ఛగా వచ్చేస్తున్నారు. దీనితో పాటు నిత్యావసరాలు, పాలు కూరగాయలకు వేలాదిగా జనం గుంపులు గా ఉంటూ కరోనా కోరలకు చిక్కే అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని వర్గాలకు మినహాయింపు ఇస్తూ సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో ఇకపై మరింత అప్రమత్తత అందరిలో అవసరం. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి పొంచివుంది.

Tags:    

Similar News