ఢిల్లీ లో ఇప్పుడు వాకింగ్ న్యుమోనియా అనే వ్యాధి వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఫ్లూ లక్షణాలతో ప్రారంభమై, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం, జ్వరం రావడం, గొంతు నొప్పి, బలహీనత, అలసట, దద్దుర్లు, చాతీ లో భారం గా ఉండడం, ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలు.

ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణాలు ఏమిటి?

ఢిల్లీ వాయు కాలుష్యం అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు, వ్యర్థాలను పారవేయడం, వాహనాల ఉద్గారాలు మొదలైనవి ఉన్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధ్యయనం ప్రకారం అక్టోబర్ 12 - నవంబర్ 3, 2024 మధ్య కాలంలో, వాహన ఉద్గారాలు అత్యధికంగా కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇది నగర కాలుష్యంలో 51.5% కారణం కాగా.. పొరుగు జిల్లాలలో జరుగుతున్న కాలుష్యం 34.9% గా చెప్పుకోవచ్చు, పంటలను తగులపెట్టడం వల్ల 8.19%, దుమ్ము రేణువులు 3.7% కాలుష్యానికి కారణం అయ్యాయి.