Andhra pradessh : నలుగురు మంత్రులే టార్గెట్

ఆంధ్రప్రదేశ్ లో నలుగురి మంత్రులను విపక్షాలు టార్గెట్ చేసినట్లు కన్పిస్తున్నాయి. జగన్ మంత్రివర్గంలో అనేక మంది మంత్రులు ఉన్నా విపక్షాలు మాత్రం కేవలం నలుగురినే లక్ష్యంగా చేసుకుని [more]

Update: 2021-10-08 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో నలుగురి మంత్రులను విపక్షాలు టార్గెట్ చేసినట్లు కన్పిస్తున్నాయి. జగన్ మంత్రివర్గంలో అనేక మంది మంత్రులు ఉన్నా విపక్షాలు మాత్రం కేవలం నలుగురినే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ నలుగురిని వీలయినంత ఇబ్బంది పెట్టాలన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా దీనికి తోడయింది. రానున్న కాలంలో ఈ నలుగురిని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలన్నది విపక్షాల వ్యూహంగా కన్పిస్తుంది.

పెద్దిరెడ్డిని నియోజకవర్గానికే…

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. చివరకు కుప్పం నియోజకవర్గంలోనూ ఆయన ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీ నేతలను తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా అనేక నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కారణంగా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. అందుకే వీలయినంత మేరకు పెద్దిరెడ్డిని కార్నర్ చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇందుకోసం సరైన నేత కోసం ఆయన నియోజకవర్గంలో పార్టీ వెతుకుతోంది.

గుడివాడలో చెక్….

కొడాలి నాని సంగతి ఇక వేరే చెప్పనక్కర లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. సామాజికవర్గం పరంగా కూడా కొడాలి నాని టీడీపీకి తలనొప్పిగా తయారయ్యారు. కొడాలి నానిని కంట్రోల్ చేయడం, ఆయన అవినీతిని వెలికి తీయడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఇప్పటికే కృష్ణా జిల్లా టీడీపీ నేతలను ఆదేశించారని తెలుస్తోంది.

వెల్లంపల్లిపై దూకుడు పెంచాలని….

పేర్ని నాని విషయంలో టీడీపీ, జనసేన గుర్రుగా ఉన్నాయి. తమ అధినేతను సామాజికవర్గం పరంగా టార్గెట్ చేస్తున్నారని జనసేన భావిస్తుంది. పేర్ని నానిని ఉపేక్షించకూడదని, సోషల్ మీడియా ద్వారా కూడా ఆయనను లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని జనసేన భావిస్తుంది. ఇదే సమయంలో పేర్ని నాని టీడీపీికి కూడా ఇబ్బందికరంగా మారారు. తమకు అండగా ఉన్న సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారని, ఆయనను వదిలిపెట్టకూడదని టీడీపీ భావిస్తుంది.

Tags:    

Similar News