కలవమంటే… కలవం

కర్ణాటకలో దాదాపు పధ్నాలుగు నెలలపాటు సాగిన మైత్రిపై రెండు పార్టీలకూ నమ్మకం లేనట్లుంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కలసికట్టుగా ముందుకు సాగలేమన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చాయి. [more]

Update: 2019-09-19 17:30 GMT

కర్ణాటకలో దాదాపు పధ్నాలుగు నెలలపాటు సాగిన మైత్రిపై రెండు పార్టీలకూ నమ్మకం లేనట్లుంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కలసికట్టుగా ముందుకు సాగలేమన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చాయి. కలసి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీకే అడ్వాంటేజీ అవుతుందని భావిస్తున్నాయి. అందుకే వచ్చే ఏ ఎన్నికలో అయినా రెండు పార్టీలూ విదివిడిగానే పోటీ చేయాలన్న ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్లు సంకేతాలు అందుతున్నాయి.

14 నెలలకే……

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పొత్తు కుదిరి సంకీర్ణ సర్కార్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన సంకీర్ణ సర్కార్ ఆ తర్వాత అసమ్మతుల కారణంగా కుప్పకూలిపోయింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు కారణం. తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు ఆయన మనవడు కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందుకు ఒక పార్టీ క్యాడర్ మరొకరికి సహకరించకపోవడమే.

కుండబద్దలు కొట్టిన……

ఇక దేవెగౌడ ఇక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా 17 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ స్థానాల్లో కూడా ఒంటరిగానే పోటీ చేయాలని దేవెగౌడ నిర్ణయించారు. ఆయన నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. పొత్తులతో వెళితే పార్టీ నాశనమవుతుందని, క్యాడర్ కు కూడా న్యాయం చేయలేకపోతున్నామని దేవెగౌడ ఆవేదన చెందారు. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ మనది ఒంటరిపోరాటమేనని దేవెగౌడ పలు సమావేశాల్లో కుండబద్దలు కొట్టేస్తున్నారు.

కాంగ్రెస్ ది కూడా….

కాంగ్రెస్ పార్టీ కూడా ఇక ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. జేడీఎస్ తో పొత్తు కారణంగానే పార్టీలో అసమ్మతి రాజుకుందని ఆ పార్టీ నమ్ముతుంది. అందుకే ఇక పొత్తు వద్దనుకుని నిర్ణయించింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావులు ఉప ఎన్నికలు జరగనున్న పదిహేడు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అక్కడ కొత్త నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, జేడీఎస్ లు కర్ణాటకలో ఇక కలవవన్న సంకేతాలు ఇస్తుండటం విశేషం.

Tags:    

Similar News