ఎవరూ కలుపుకోరు.. కలుపుకుందామన్నా రారు
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కనుమరుగైపోయింది. పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడా రెండు మూడు స్థానాలు గెలిచినా అది అభ్యర్థుల వ్యక్తితగత బలం కారణంగానే. కాంగ్రెస్ నేతలు [more]
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కనుమరుగైపోయింది. పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడా రెండు మూడు స్థానాలు గెలిచినా అది అభ్యర్థుల వ్యక్తితగత బలం కారణంగానే. కాంగ్రెస్ నేతలు [more]
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కనుమరుగైపోయింది. పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడా రెండు మూడు స్థానాలు గెలిచినా అది అభ్యర్థుల వ్యక్తితగత బలం కారణంగానే. కాంగ్రెస్ నేతలు కూడా పంచాయతీ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను లైట్ గా తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోక పోతుండటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదు.
పంచాయతీ ఎన్నికల్లో…..
పంచాయతీ ఎన్నికలు సింబల్ లేకపోవడంతో ఏదో కొన్ని చోట్ల గెలిచిన వారు తామ పార్టీ వారే అని చెప్పుకునే వీలుకలిగింది. అయితే వీరంతా కాంగ్రెస్ లో ఉంటారన్న నమ్మకం లేదు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీస పనితీరును కూడా కన్పించే అవకాశం మాత్రం లేదు. ఇప్పటికే అభ్యర్థులందరూ డిసైడ్ అయిపోయారు. గుర్తు కోసం కొందరు ఇతర పార్టీల టిక్కెట్లు రాని వారు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినా వారు కూడా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత జారుకున్నారు.
సీనియర్ నేతలందరూ…..
ఇప్పుడు కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ లో నడిపించే నేతకూడా కరువయ్యారు. పీసీీసీ అధ్యక్షుడు శైలజానాధ్ ఉన్నప్పటికీ ఆయన ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పరిస్థితి లేదు. సీనియర్ నేతలందరూ పార్టీని పట్టించుకోవడం లేదు. పేరుకే నేతలున్నా వారు జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు తప్పించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పల్లంరాజు, జేడీ శీలం, చింతా మోహన్, హర్షకుమార్ వంటి నేతలున్నా వారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు.
తిరుపతి ఉప ఎన్నికకయినా….
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ప్రచారానికి కూడా జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశం లేదు. కనీసం రాష్ట్ర స్థాయి నేతలు, గతంలో కీలక పదవులను అనుభవించిన వారు ప్రచారానికి రావాలని చింతామోహన్ ఇటీవల ఆహ్వానించారట. అయితే ఇంతవరకూ వారి నుంచి స్పందన లేదని తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ ను ఎవరూ కలుపుకుని వెళ్లలేని పరిస్థితి. కాంగ్రెస్ తో ఎవరూ కలసి రాని పరిస్థితి. ఒంటరిగా కాంగ్రెస్ చేసే పోరాటం కొన్నేళ్ల పాటు కొనసాగాల్సిందే. ఓటములను చవిచూడాల్సిందే.