ఇక వీళ్లంతా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లేనట

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగయిందనే చెప్పాలి. ఆ పార్టీకి భవిష్యత్ కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు. వైసీపీ ఉన్నంత వరకూ కాంగ్రెస్ కు ఇక [more]

Update: 2021-05-12 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగయిందనే చెప్పాలి. ఆ పార్టీకి భవిష్యత్ కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు. వైసీపీ ఉన్నంత వరకూ కాంగ్రెస్ కు ఇక అవకాశం లేనట్లే. కనీసం శాసనసభలోనూ ప్రాతినిధ్యం దక్కడం కష్టమే. ఈ పరిస్థితి అర్థమయ్యే అనేక మంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు తమ రాజకీయ జీవితానికి వారంతట వారే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారనే చెప్పాలి.

నేతలకు కొదవ లేదు కానీ?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలకు కొదవలేదు. 2009 నుంచి 2014 వరకూ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ పదేళ్లలో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ మంత్రి పదవులు అనుభవించిన వారున్నారు. ప్రజలను ప్రభావితం చేయగలిగిన నేతలే, రాష్ట్ర విభజన సమయంలో ఢిల్లీలో వీరే కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటారని ప్రజలు వీరిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ప్రజలే దూరంపెట్టడంతో….

కానీ కట్ చేస్తే విభజన తర్వాత జనం వీరందరినీ దూరం పెట్టారు. 2014 ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసి ఇక రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి పల్లం రాజు, జెడి శీలం, కనుమూరి బాపిరాజు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది నేతలున్నారు. వీరంతా ఇప్పుడు స్వచ్ఛంద రాజకీయ విరమణ చేసినట్లే కన్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి దూరమయినట్లే.

ఎన్నికల సమయంలోనూ…

ఏపీలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కనీసం అభ్యర్థులను కూడా పోటీకి దింపే పరిస్థిితి కన్పించలేదు. సీనియర్ నేతలున్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పోటీకి దింపలేకపోయారు. ఇక తిరుపతి ఉప ఎన్నికలో చింతామోహన పార్టీ నుంచి బరిలోకి దిపితే కనీసం ఆయనకు మద్దతిచ్చేందుకు కూడా ముందుకు రాలేకపోయారు. దీంతో సీనియర్ నేతలు ఇప్పటికే పదేళ్లు రాజకీయాలకు దూరమయ్యారు. ఇక వారంతా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినట్లేనని చెబుత్నారు.

Tags:    

Similar News