కాంగ్రెస్ కి పెద్ద దండమే పెట్టేశారు… ?
కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం. అందులో వార్డు స్థాయి పార్టీ పదవిని కూడా గొప్పగా చెప్పుకుని బతికేసేవారు. కానీ వైఎస్సార్ మరణానంతరం ఆ పార్టీ [more]
కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం. అందులో వార్డు స్థాయి పార్టీ పదవిని కూడా గొప్పగా చెప్పుకుని బతికేసేవారు. కానీ వైఎస్సార్ మరణానంతరం ఆ పార్టీ [more]
కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం. అందులో వార్డు స్థాయి పార్టీ పదవిని కూడా గొప్పగా చెప్పుకుని బతికేసేవారు. కానీ వైఎస్సార్ మరణానంతరం ఆ పార్టీ నెమ్మదిగా క్షీణిస్తూ వస్తోంది. 2014 తరువాత ఏపీలో ఉనికిలో లేకుండా పోయింది. ఇక 2019 ఎన్నికల్లో నోటాతో పోటీ పడింది. తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊసు ఆ పార్టీలో ఇప్పటికీ ఉన్నామనుకునే వారికే లేదు. లేటెస్ట్ గా తిరుపతి రిజల్ట్ తో కాంగ్రెస్ ఖతమని పూర్తిగా అర్ధమైపోయినట్లుంది. అందుకే ఆ పార్టీలో మిగిలిన అర కొర నేతల రాజీనామాలకు తెర లేస్తోంది.
గుడ్ బై అనేశారే…?
విశాఖ జిల్లాకు చెందిన పేడాడ రమణి కుమారి బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. ఆమె రాజకీయ జీవితం ప్రజారాజ్యం నుంచి మొదలైంది. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక ఆమె అందులోనే ఈ రోజు వరకూ కొనసాగారు. ఆమె 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల వేళ ఏకంగా విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఏమి చేసినా కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా రాలేదు. ఇక ఆమెను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఢిల్లీ పెద్దలు నియమించారు. ఇంతకాలం సొంత చమురు ధారపోసి పార్టీ కోసం కష్టపడిన ఆమె ఇపుడు కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేశారు.
గురువు బాటలోనా..?
ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనతోనే ఆమె 2014 వరకూ ఉంటూ వచ్చారు. గంటా అటునుంచి టీడీపీలో చేరిపోయారు. కానీ పేడాడకు అక్కడ సరైన ప్లేస్ లేకపోవడంతో ఉన్న చోటే ఉండిపోయారు. ఒక్కొక్కరుగా పెద్దలు అంతా కాంగ్రెస్ ని వీడిపోవడంతో నగర కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలు మీద పడ్డాయి. మొత్తానికి ఆమె ఇన్నాళ్ళకు బంధ విముక్తురాలు అయ్యారు. కాంగ్రెస్ వల్ల రాజకీయంగా ఏమీ ఒనకూడదని కూడా గట్టిగా తీర్మానించుకున్నారు. మరి ఆమె భవిష్యత్తు రాజకీయం ఏంటి అంటే గంటా వెంట నడుస్తారా అన్న చర్చ అయితే ఉంది.
వైసీపీ వైపుగా…?
మరో వైపు చూస్తే వైసీపీలోనే టోటల్ గా నగర కాంగ్రెస్ నాయకులు అంతా ఉన్నారు. దాంతో ఆమె వైసీపీలో చేరుతారని అంటున్నారు. మంచి వక్తగా మహిళా నేతగా. విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న కాళింగ సామాజికవర్గం మహిళా నేతగా ఆమె ఉన్నారు. వైసీపీలో ఆమె చేరికకు అయితే ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ ఏ పదవీ లేకుండా వస్తారా అన్నది చూడాలి. సరే పేడాడ ఎక్కడ సెటిల్ అవుతారు అన్నది పక్కన పెడితే విశాఖ కాంగ్రెస్ దీపానికి చమురు పోసే ఆఖరి వ్యక్తి కూడా ఆఫీస్ గేటు దాటేసారు. దాంతో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ అత్యంత దైన్య స్థితిలోకి వెళ్ళిపోయిందని ఆ పార్టీ అభిమానులు అయితే కుములుతున్నారు. పీసీసీ చీఫ్ గా శైలజానాధ్ లాంటి వారు వస్తే మీడియా మీటింగ్ ఏర్పాటు చేసే సీన్ కూడా ఇకపైన ఉంటుందా అన్నది కూడా ఒక చర్చ. మొత్తానికి అందరూ కలసి విజయవంతంగా విశాఖ కాంగ్రెస్ తలుపులు మూసేశారు అనే చెప్పాలి.