దెబ్బకొట్టగలరా? అదే జరిగితే?

బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ లో మోదీని నిలువరించగలిగితే కొంత పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తుంది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని [more]

Update: 2020-10-22 16:30 GMT

బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ లో మోదీని నిలువరించగలిగితే కొంత పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తుంది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఆర్జేడీ కూటమిలో ఉంది. ఆర్జేడీ ఈ మహాకూటమికి నేతృత్వం వహిస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ఇప్పటికే మహా కూటమి ప్రకటించింది.

పార్టీలోకి చేరికలతో……

ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు కలసి వచ్చే ప్రతి పార్టీతో కాంగ్రెస్ చేతులు కలుపుతోంది. మరోవైపు సీనియర్ నేత శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం కలసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. శరద్ యాదవ్ ను ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ యు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి పార్టీని నితీష్ కుమార్ తీసుకోవడంతో శరద్ యాదవ్ సొంతంగా లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని పెట్టుకున్నారు.

జోరు మీదున్న కాంగ్రెస్…..

కానీ శరద్ యాదవ్ ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీలకంగా లేకపోవడంతో ఆయన కూతురు సుభాషిణి కాంగ్రెస్ లో చేరడంతో జేడీయూకు కొంత ఇబ్బందికరమైన పరిణామమని చెప్పకతప్పదు. దీంతో పాటు లోక్ జనశక్తి పార్టీకి చెందిన మాజీ ఎంపీ కాశీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్జేపీ ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే కాశీపాండే కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఇతర పార్టీల నేతల చేరికతో కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే చెప్పాలి.

ప్రచారంలోనూ……

ఇక బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 30 స్టార్ క్యాంపెయిన్ల జాబితాను విడుదల చేసింది. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వేర్వేరుగా వివిధ సభలు, ర్యాల్లీల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శతృఘ్నసిన్హా సేవలను కూడా ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ బీహార్ లో బీజేపీని దెబ్బకొట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలిస్తాయో? లేదో? చూడాలి మరి.

Tags:    

Similar News