Congress : తర్వాత టార్గెట్ ఈయనేనా?
కాంగ్రెస్ పార్టీకి ఉన్నవి మూడు రాష్ట్రాలే. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రిని మార్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలోనే కాంగ్రెస్ [more]
కాంగ్రెస్ పార్టీకి ఉన్నవి మూడు రాష్ట్రాలే. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రిని మార్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలోనే కాంగ్రెస్ [more]
కాంగ్రెస్ పార్టీకి ఉన్నవి మూడు రాష్ట్రాలే. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రిని మార్చేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్ర వంటి చోట అధికారంలో ఉన్న ప్పటికీ అది సంకీర్ణ ప్రభుత్వం. తాజాగా పంజాబ్ లో ముఖ్యమంత్రి అమరీందర్ ను మార్చింది. ఇక తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఛత్తీస్ ఘడ్ లోనే అన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది.
సోనియా జోక్యంతో….
ఛత్తీస్ ఘడ్ లో 2018లో ఎన్నికలు జరిగాయి. దశాబ్దకాలం ఉన్న రమణసింగ్ ను కాదని ఛత్తీస్ ఘడ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. దీంతో అక్కడ ముఖ్యమంత్రిగా భూపేష్ బగేల్ ను పార్టీ అధినాయకత్వం నియమించింది. రాహుల్ గాంధీ టీఎస్ సింగ్ దేవ్ వైపు మొగ్గు చూపినా సోనియా జోక్యంతో భూపేష్ బగేల్ వైపు మొగ్గు చూపింది. ఛత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు మొదలయ్యాయి.
భూపేష్ పై అసంతృప్తి….
భూపేష్ బగేల్ ను తొలగించాలని పార్టీ నేతల నుంచి వత్తిడి మొదలయింది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ముల ప్రకరాం భూపేష్ బగేల్ ను తప్పించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే దీనిపై ఢిల్లీలో పంచాయతీ జరిగింది. తనకు ముఖ్మమంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని టీఎస్ సింగ్ దేవ్ కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల స్వయంగా ఆయనతో మాట్లాడి నచ్చ చెప్పారు. అయితే సింగ్ దేవ్ వర్గం మాత్రం ససేమిరా అంటోంది.
ఆయనను తప్పిస్తారని…
దీంతో భూపేష్ బగేల్ ను కూడా త్వరలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారంటున్నారు. ముఖ్యమంత్రి మార్పిడి తప్పదన్న సంకేతాలను కూడా వదులుతున్నారు. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అసంతృప్తులతో విలవిలలాడుతుంది. 2023లో ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలంటే కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించాల్సి ఉంటుంది. మరి మూడు రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇక్కడా పరాభవం తప్పదు.