ముఖ్యమంత్రిని మారుస్తారా?

అధికారంలోకి వచ్చినప్పుడు సహకరించుకున్న నేతలు రోజులు గడిచే కొద్దీ వారిలో అసంతృప్తులు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీలో ఇది సాధారణంగా కన్పించే అంశం. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి [more]

Update: 2021-08-27 16:30 GMT

అధికారంలోకి వచ్చినప్పుడు సహకరించుకున్న నేతలు రోజులు గడిచే కొద్దీ వారిలో అసంతృప్తులు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీలో ఇది సాధారణంగా కన్పించే అంశం. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయినా నేతల మధ్య విభేదాలకు మాత్రం కొదవలేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులు మర్చి పోవడమే విభేదాలకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు.

అధికారంలోకి వచ్చిన తర్వాత?

ఛత్తీస్ ఘడ్ లో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పటి వరకూ పాతుకుపోయి ఉన్న బీజేపీ సీఎం రమణ్ సింగ్ ను కాదని ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. అప్పట్లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తర్వాత ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని కాంగ్రెస్ భావించింది. అందుకే అధిష్టానం కూడా ఆ యా రాష్ట్రాల్లో నేతలకు హమీలు ఇచ్చి పదవులను పంపకాలు చేసింది.

ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా….

ఛత్తీస్ ఘడ్ లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ భూపేష్ బగేల్ వైపు మొగ్గు చూపింది. అయితే టీఎస్ సింగ్ దేవ్ కూడా పోటీ పడ్డారు. రాహుల్ గాంధీ సింగ్ దేవ్ పట్ల అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి మొగ్గు చూపినా సోనియా గాంధీ మాత్రం భూపేష్ బగేల్ వైపు మొగ్గు చూపారు. దీంతో రాహుల్ గాంధీ సయోధ్య జరిపేందుకు ప్రయత్నించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి మార్పు ఉంటుందని, అప్పుడు సింగ్ దేవ్ కు అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ యువనేత రాహుల్ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

రెండున్నరేళ్లు పూర్తి కావడంతో…?

ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బగేల్ రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఆయన దిగిపోవాలని సింగ్ దేవ్ కోరుతున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ పై కాంగ్రెస్ లోనూ అసంతృప్తి కూడా పెరిగిపోతుంది. మరో మధ్యప్రదేశ్ మాదిరి కాకుండా ఇక్కడ చర్యలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఇరువురి నేతలను బుజ్జగిస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పిడి ఉంటుందా? లేదా? అన్నది త్వరలోనే డిసైడ్ చేస్తారు.

Tags:    

Similar News