బీఫారం అంటేనే భయపడేటట్లు?
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను పూర్తిగా నైరాశ్యంలో ముంచేశాయి. దాదాపు 63 స్థానాల్లో కాంగ్రెస అభ్యర్థులు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. ఒక జాతీయ పార్టీ [more]
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను పూర్తిగా నైరాశ్యంలో ముంచేశాయి. దాదాపు 63 స్థానాల్లో కాంగ్రెస అభ్యర్థులు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. ఒక జాతీయ పార్టీ [more]
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను పూర్తిగా నైరాశ్యంలో ముంచేశాయి. దాదాపు 63 స్థానాల్లో కాంగ్రెస అభ్యర్థులు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. ఒక జాతీయ పార్టీ అదీ దేశ రాజధానిలో ఈ పరిస్థితిని ఎదుర్కొనడం బాధాకరమే. వందేళ్ల చరిత్రకు పైగా ఉన్న జాతీయ పార్టీ వైపు ఇప్పుడు నేతలు చూసే పరిస్థితి లేదు. అయితే ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పాల్సి ఉంటుంది.
గతంలో కేజ్రీ…..
నిజానికి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అందుకు తగ్గిన ప్రణాళికలను కూడా రూపొందించుకోవాలి. అంతకు ముందు కేజ్రీవాల్ కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అన్నారు. పంజాబ్ ఎన్నికల సమయంలో సీట్లు అడిగినందుకు కాంగ్రెస్ కాదు పొమ్మంది. అప్పట్లో షీలా దీక్షిత్ సయితం కేజ్రీవాల్ తో పొత్తును వ్యతిరేకించారు. బీజేపీని కట్టడి చేయాలంటే కాంగ్రెస్ తో పొత్తుకు అప్పట్లో కేజ్రీవాల్ సిద్ధమయినా కాంగ్రెస్ అందుకు ముందుకు రాలేదు.
పార్లమెంటు ఎన్నికల్లో….
ఫలితంగా పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజవకర్గాల్లో ఒక్క సీటును సాధించుకోకపోయినా దాదాపు 22 శాతం ఓట్లు తెచ్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కంటే తానే మెరుగని నిరూపించుకుంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినా అందుకు తగిన ప్రణాళికను రచించుకోలేకపోయింది.
డిపాజిట్లు కూడా రాక….
సత్తా లేని అభ్యర్థులకు బీపారంలు ఇచ్చింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను చేర్చుకోవడం కూడా సరైైన ఫలితాలు ఇవ్వలేదు. ఆల్కాలాంబా లాంటి నేతలు సయితం కాంగ్రెస్ బీఫారం తీసుకుని భంగపడ్డారు. కాంగ్రెస్ చీఫ్ కుమార్తె కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. మొత్తం మీద 4.27 శాతం ఓట్లను మాత్రమే కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో తెచ్చుకోగలిగింది. ఇక భవిష్యత్తులో బీఫారం ఇస్తామంటేనే కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితిని అగ్రనేతలు తమకు తాముగా తెచ్చుకున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియా లో విన్పిస్తుండటం విశేషం.