కాంగ్రెస్ ఖేల్ ఖతం చేయడానికేనా?

కాంగ్రెస్ పార్టీకి కష్టాలు వీడటం లేదు. అసలే ఓటములతో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కేసులు మరో తలనొప్పిగా మారనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలను బీజపీ టార్గెట్ చేసిందనే [more]

Update: 2020-07-08 18:29 GMT

కాంగ్రెస్ పార్టీకి కష్టాలు వీడటం లేదు. అసలే ఓటములతో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కేసులు మరో తలనొప్పిగా మారనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలను బీజపీ టార్గెట్ చేసిందనే చెప్పాలి. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కోలుకోనివ్వకుండా చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ పావులు కదుపుతుందన్నది స్సష్టంగా అర్థమవుతోంది. తాజాగా నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుతో కాంగ్రెస్ కు మరిన్ని కష్టాలు మొదలయినట్లేనని చెబుతున్నారు.

అసలే ఆర్థిక ఇబ్బందులు….

కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అనేక రాష్ట్రాల్లో ఓటమి పాలు కావడం ఒక కారణమైతే, పార్టీకి నిధులు ఇచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. రాహుల్, సోనియా రాష్ట్రాల పర్యటనలు కూడా ఆలోచించి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ ఆర్థికంగా ఇబ్బంది పడిందన్న వ్యాఖ్యలు విన్పించాయి. ప్రస్తుతం రాజస్థాన్, పుదుచ్చేరి, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది.

రాజకీయంగా ఆరోపణలు….

ఇటీవల చైనా భారత సరిహద్దుల్లో కాలు దువ్విన సందర్భంగా పీఎం కేర్ కు చైనా కంపెనీలు విరాళాలు ఇచ్చాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనికి ధీటుగా చైనా నుంచి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి చెందిన ట్రస్ట్ లకు కోట్ల రూపాయల నిధులు అందాయని బీజేపీ నేతలు ఆరోపించారు. చైనా ను రెండు పార్టీలు రాజకీయంగా వినియోగించుకోవాలని ప్రయత్నించాయి. చైనా కొంత తగ్గడంతో వీరు కూడా మాటల దాడిని నిలిపేశారు.

ఈడీ కేసు నమోదుతో….

కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ట్రస్ట్ లపై విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. విచారణ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ తో ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. ట్రస్ట్ ల ద్వారా కాంగ్రెస్ పార్టీ మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయంటున్నారు. అలాగే ఫారిన్ కంట్రిబ్యూటరీ రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘన కింద కూడా కేసు నమోదయ్యే అవకాశముంది. 2005 – 06 లో చైనా ఎంబసీ నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల డాలర్లు విరాళాలు సేకరించిందని చెబుతున్నారు. ఆ సమయంలో సోనియా ట్రస్ట్ కు ఛైర్ పర్సన్ గా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా సోనియాను టార్గెట్ చేసినట్లే కనపడుతుంది. ఈ కేసుల నుంచి కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో చూడాలి.

Tags:    

Similar News