బేరీజు వేసుకుంటున్నారా?

అందరం జట్టు కట్టి కేసీఆర్ ను ఓడిద్దామనుకున్నారు. 2018 తెలంగాణఎన్నికల్లో మహాకూటమి ఆవిర్భవించింది. కాంగ్రెస్ తో సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ఒక జట్టుగా ఎన్నికలకు [more]

Update: 2019-10-04 00:30 GMT

అందరం జట్టు కట్టి కేసీఆర్ ను ఓడిద్దామనుకున్నారు. 2018 తెలంగాణఎన్నికల్లో మహాకూటమి ఆవిర్భవించింది. కాంగ్రెస్ తో సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ఒక జట్టుగా ఎన్నికలకు వెళ్లాయి. కానీ జట్టు కట్టినా ఫలితాలు అనుకూలంగా రాలేదు. దారుణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీఎన్నికల్లో మహాకూటమిని నమ్మక పోవడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం లేకపోవడమే. కొత్త గా ఏర్పడిన రాష్ట్రంలో కాంగ్రెస్ కు పగ్గాలు ఇస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని బహుశా ప్రజలు భావించి ఉండవచ్చు. అందుకే కూటమిని ప్రజలు తిరస్కరించారు.

కూటమి కట్టినా…..

ముఖ్యమైన పార్టీలన్నీ ఒకే మాట మీద వెళ్లినా కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టారు. దీంతో కూటమిలోని పార్టీలన్నీ దాదాపు నిస్తేజంలోకి వెళ్లిపోయాయి. కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలూ దాదాపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనుమరుగయి పోయాయి. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం పోటీ చేయని పరిస్థితి కొన్ని పార్టీలది. ప్రధానంగా 2018 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కన్పించకుండా పోయిందనేచెప్పాలి. కేవలం ఇద్దరు మాత్రమే గెలవడం, అందులో ఒకరు పార్టీని వీడటంతో ఆ పార్టీ ఇక కోలుకునే పరిస్థితి లేదు.

హుజూర్ నగర్ ఎన్నికను….

అందుకే హుజూర్ నగర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. హుజూర్ నగర్ ఎన్నికను ఒక మోడల్ గా చంద్రబాబుతీసుకున్నారు. ఇక కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి తెలంగాణ జనసమితి కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అంటే తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. అయితే కాంగ్రెస్ తో కలవడంతో ప్రజలు కోదండరామ్ ను కూడా పక్కన పెట్టారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ కు దూరంగానే ఉంటేనని మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు.

విడివిడిగా పోటీ చేస్తే…..

ఇక సీపీఐ మహాకూటమిలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా అది కాంగ్రెస్ తో అంటీ ముట్టన్నట్లుగానే ఉంది. కూటమి కడితే తమ సొంత ఓటు బ్యాంకును కూడా కోల్పోతామని అన్ని పార్టీలూ గ్రహించినట్లున్నాయి. అందుకే కూటమి రాజకీయాలకు ఇక తెలంగాణలో చెల్లుచీటీయేనని చెప్పక తప్పదు. అందరూ ఒక్కటైనా ఓడించలేకపోయామని, విడివిడిగాపోటీచేసి గెలుపోటములు ఎలా ఉంటాయన్నది బేరీజే వేసుకోవడానికే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉపయోగపడుతుంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు ముందు కన్పించిన ఐక్యత ఇప్పుడు పార్టీల్లో కన్పించడం లేదు. కాంగ్రెస్ నమ్మకం కోల్పోవడమే ఇందుకు కారణంగా చూడాలి.

Tags:    

Similar News