కాటేయాలని కమలం

క్షణక్షణం భయం భయం లో మిట్టాడుతుంది కాంగ్రెస్ జెడిఎస్ సర్కార్. ఒక్కో ఎమ్యెల్యే కమలం శిబిరం వైపు జారిపోతూ ఉండటంతో కుమార స్వామి సర్కార్ ఏ సమయంలో [more]

Update: 2019-07-09 05:00 GMT

క్షణక్షణం భయం భయం లో మిట్టాడుతుంది కాంగ్రెస్ జెడిఎస్ సర్కార్. ఒక్కో ఎమ్యెల్యే కమలం శిబిరం వైపు జారిపోతూ ఉండటంతో కుమార స్వామి సర్కార్ ఏ సమయంలో అయినా కుప్పకూలడానికి సిద్ధంగా వుంది. అసంతృప్తులను తిరిగి తమ గూటికి చేర్చుకునేందుకు మొత్తం క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేసేయడంతో కథ క్లైమాక్స్ కి చేరుకుంది. మరోపక్క ముంబయి లోని ఒక హోటల్ లో 16మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్యెల్యేలు కూటమి కట్టారు. వీరికి రక్షణ గా బిజెపి తన బృందాన్ని నియమించింది.

మరోషాక్ ఇచ్చిన స్వతంత్ర ఎమ్యెల్యే …..

ఈ 16మందికి తాజాగా మరో ఎమ్యెల్యే జత చేరనున్నారు. సంకీర్ణ సర్కార్ కి తన మద్దతు ఉపసంహరిస్తున్నట్లు స్వతంత్ర ఎమ్యెల్యే నగేష్ ప్రకటించారు. ఆయన్ను ప్రత్యేక విమానంలో దగ్గరుండి బిజెపి మాజీ సిఎం యడ్యూరప్ప ముంబయి పంపించారు. మరోపక్క కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ మైనారిటీలో పడి బిజెపి మెజారిటీలోకి వచ్చింది.

ఇది పరిస్థితి ….

కర్ణాటకలో మొత్తం 211 స్థానాలకు గాను కాంగ్రెస్ కి 79, జెడిఎస్ కి 37, బిఎస్పీ 1, ఇతరులు 2 స్థానాలు సాధించారు. వీరిలో 16 ప్లస్ మరొకరు వెళ్ళాకా కాంగ్రెస్ – జెడిఎస్ లు 102 కు పడిపోయాయి. మరోపక్క బిజెపి బలం 106 అలానే వుంది. మ్యాజిక్ ఫిగర్ 113 కావడంతో 16 మంది రాజీనామా లను స్పీకర్ ఆమోదిస్తే కుమార స్వామి సర్కార్ కుప్పకూలడం ఖాయమని తేలిపోయింది. తాజాగా యడ్యూరప్ప హడావిడి చూస్తే ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో ఉన్నట్లు కనిపిస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి నుంచి గోవాకు మకాం మార్చారు. మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కాకుంటే వేటు వేస్తామని కాంగ్రెస్ హెచ్చరికలు జారీ చేసింది. నిమిషానికో మలుపు తిరుగుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభం ఎలాంటి ముగింపు ఇవ్వనుందో వేచి చూడాలి.

Tags:    

Similar News