ఆశలన్నీ దానిపైనే…?

కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆశలతోనే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలున్నాయి. ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు రాకుండా చూడటమే ఇప్పుడు విపక్షాల [more]

Update: 2019-10-04 17:30 GMT

కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆశలతోనే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలున్నాయి. ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు రాకుండా చూడటమే ఇప్పుడు విపక్షాల టార్గెట్. ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. నిజానికి ఈ పదిహేను నియోజకవర్గాల్లో ప్రజా తీర్పును పరిహాసం చేస్తూ అప్పటి ఎమ్మెల్యేలు వ్యవహరించడంతో ప్రజల సానుభూతి తమపైనే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు.

వారికే ఇస్తామనడంతో….

భారతీయ జనతా పార్టీ కూడా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అంచనా వేస్తున్నాయి. రెండు నెలల్లో కుమారస్వామి ప్రభుత్వం పతనం ఖామయంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జోస్యం చెప్పటం వెనక కూడా ఇదే కారణమంటున్నారు. వరదల సమయంలో ఒక ప్రాంతానికే యడ్యూరప్ప న్యాయం చేస్తున్నారని, విపక్షాలకు పట్టున్న ప్రాంతాలకు నిధుల విషయంలో అన్యాయం చేస్తున్నారంటున్నారు.

కలసి పోటీ చేస్తే….

నిజానికి కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేస్తే ఈ పదిహేను నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపేదన్నది విశ్లేషకుల అంచనా. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు మాత్రమే కావడంతో ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత అంతగా ఉండబోదు. ఈ పదిహేను నియోజకవర్గాల్లో కాంగ్రెస్, జేడీఎస్ లపైనే సానుభూతి ఉంటుందన్నది ఆయా పార్టీ నేతల అంచనా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం కొట్లాటలు ప్రారంభమయ్యాయి.

సత్తా చాటాలని……

ఇక జనతాదళ్ ఎస్ నేతలకు ఈ పదిహేను నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ఇందులో మూడు నియోజకవర్గాలు సిట్టింగ్ స్థానాలు కావడంతో జేడీఎస్ వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. తమ సిట్టింగ్ స్థానాలను తాము చేజక్కించుకుంటే చాలునన్న ధోరిణితోనే జేడీఎస్ ఉంది. కాంగ్రెస్ మాత్రం పదిహేను నియోజకవర్గాల్లో సత్తా చాటాలని చూస్తోంది. మొత్తం మీద సానుభూతితోనే గట్టెక్కాలని జేడీఎస్, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. యడ్యూరప్ప మాత్రం ప్రభుత్వం పతనం కాకుండా తగిన స్థానాలు దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డక తప్పదు.

Tags:    

Similar News