నెల దాటినా నిర్ణయం లేదే?

కర్ణాటకలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతుందా? ఇద్దరు ముఖ్యనేతల పదవులకు రాజీనామా చేసినా వాటిపై ఇంకా నిర్ణయం తీసుకునేందుకు వెనుకంజ వేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలతో చర్చోప చర్చలు [more]

Update: 2020-01-05 16:30 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతుందా? ఇద్దరు ముఖ్యనేతల పదవులకు రాజీనామా చేసినా వాటిపై ఇంకా నిర్ణయం తీసుకునేందుకు వెనుకంజ వేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలతో చర్చోప చర్చలు జరపడమే తప్ప అధిష్టానం ఒక్క అడుగు కూడా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.. సరైన నాయకుడు లేకుంటే పార్టీ మనుగడ సాధించలేదన్నది వాస్తవం. సరైన నాయకత్వంతోనే ఏ పార్టీ అయినా విజయాలను సొంతం చేసుకుంటుంది.

ఎన్నికలు లేకున్నా….

ఇప్పటికిప్పుడు కర్ణాటకలో ఎన్నికలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కన్పిస్తుంది. ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సీఎల్పీ నేతగా ఉన్న సిద్ధరామయ్య, పీసీీసీ అధ్యక్షుడిగా ఉన్న దినేష్ గుండూరావులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇది జిరిగి దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినా కాంగ్రెస్ అధిష్టానం వీరి రాజీనామాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమోదించినట్లు కూడా ప్రకటించలేదు.

డీకే కు పట్టం కట్టాలని…

అయితే పీసీసీ అధ్యక్షుడిని మార్చాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం పెద్దయెత్తున జరిగింది. దినేష్ గుండూరావు స్థానంలో ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ను నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ అయితే జేడీఎస్ తో కూడా సఖ్యతగా మెలుగుతారని అధిష్టానం భావించింది. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా డీకే కలుపుకుని పోతారని అధిష్టానం విశ్వసిస్తోంది. ఆయన పేరు ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది.

సిద్ధూను మార్చకుండా?

అలాగే సిద్ధరామయ్య విషయంలో మాత్రం అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించడానికి కొంత ఆలోచిస్తున్నట్లు కనపడుతోంది. సిద్ధరామయ్యనే సీఎల్పీ నేతగా కొనసాగించడం బెటరని హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యతో మాట్లాడిన తర్వాతనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందంటున్నారు. ఇద్దరు కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతప్తి నెలకొంది.

Tags:    

Similar News