కొడితే కొట్టాలిరా….?
ఈసారి కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు మూడు పార్టీల భవిష్యత్తును మార్చనున్నాయి. ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని పార్టీలూ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే [more]
ఈసారి కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు మూడు పార్టీల భవిష్యత్తును మార్చనున్నాయి. ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని పార్టీలూ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే [more]
ఈసారి కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు మూడు పార్టీల భవిష్యత్తును మార్చనున్నాయి. ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని పార్టీలూ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇందులో తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ లో జోష్ ను నింపాయి.
ఉప ఎన్నికలు జరిగే…..
కర్ణాటకలో వచ్చేనెల 5వ తేదీన పదిహేను అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిక్కబళ్లాపూర్, కేఆర్ పుర, యశ్వంతపుర, మహాలక్ష్మి, శివాజీనగర్, అథాని, కాగ్వాడ్, గోకక్, ఎల్లాపూర్, హైరకెరూర్, రానెబెన్నూరు, విజయనగర ,హోసకోతె, క్రిష్ణరాజ్‌పేట్, హున్సూరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలన్నీ కాంగ్రెస్, జేడీఎస్ సిట్టింగ్ స్థానాలే.
సానుభూతి పనిచేస్తుందని…..
సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు కాంగ్రెస్ కష్టాలు పడుతోంది. ఇప్పటికే ఉప ఎన్నికల బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అప్పగించింది. డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగారు. ఇందులో నియోజకవర్గాల వారీ ఇన్ ఛార్జుల నియామకం కూడా దాదాపు పూర్తయింది. సానుభూతితో ఎలాగైనా తాము గెలిచి తీరతామని కాంగ్రెస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన అనర్హత ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో గెలవరన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది.
ముందుగానే అభ్యర్థుల ఎంపిక…..
ఇక నెలరోజులకు పైగానే ఉప ఎన్నికలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రచారం చేసుకునేందుకు సమయం కల్పించేలా అభ్యర్థులను ఖరారు చేసింది. పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్, వేణుగోపాల్ తో కూడిన బృందం రూపొందించిన జాబితాకు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ఎనిమిది మంది ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. హర్యానాలో మాదిరి ప్రచారంలో వెనకబడకూడదని సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ కర్ణాటక ఉప ఎన్నికల్లో సీరియస్ గానే అడుగులు వేస్తోంది.