కాంగ్రెస్ కు ఇప్పటికైనా బుద్ధిరాదా?

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ పార్టీ నేతల్లో ఏ మాత్రం పార్టీ పట్ల అంకిత భావం లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. పార్టీకి [more]

Update: 2021-03-22 16:30 GMT

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ పార్టీ నేతల్లో ఏ మాత్రం పార్టీ పట్ల అంకిత భావం లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. పార్టీకి తామే తోపులమని భావిస్తూ కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారు. సీనియర్ నేతలే తమకు పదవులు కావాలంటూ, తమ వర్గాన్ని ప్రోత్సహిస్తుండటంతో అనేకచోట్ల కాంగ్రెస్ కష్టాల్లో ఉంది. దీంతో పార్టీని వీడేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. కేరళ ఎన్నికల్లో సయితం ఇదే జరుగుతుంది.

ఊపు ఉన్నా….

కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొంత ఊపు ఉంది. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కేరేళలో గెలుస్తామన్న ఆశ కాంగ్రెస్ కు ఉంది. కానీ కేరళ కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీని విజయం వైపు నడిపించలేకపోతున్నారు. తమ స్వార్థం కోసం పార్టీని బలి చేస్తున్నారు. తాజాగా కేరళలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీ చాకో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వర్గ విభేదాల కారణంగానే కాంగ్రెస్ ను వీడారు.

రెండు వర్గాలుగా….

కేరళ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఉమెన్ చాందీ ఒక వర్గానికి నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి రమేష్ చెన్నితాల నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలోనూ వీరిద్దరిదే పైచేయి అయింది. పీసీ చాకో మాటల్లోనే చెప్పాలంటే కేరళ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఎ గ్రూపులున్నాయి. వీరిని నియంత్రించేందుకు అధిష్టానం సయితం ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

పీసీ చాకో రాజీనామాతో…

కేరళ కాంగ్రెస్ లో పీసీ చాకో సీనియర్ నాయకుడు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. కేరళ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా రాజకీయంగా కలకలం రేపుతుంది. తన రాజీనామా లేఖను పీసీ చాకో నేరుగా సోనియా గాంధీకి పంపారు. ఇలాంటి నేతలు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అసలే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించాల్సిన సీనియర్ నేతలు వర్గాలుగా విడిపోవడం ఆ పార్టీ భవిష్యత్ ను తెలియజేస్తుంది.

Tags:    

Similar News