ముసలం ముంగిటే ఉందే
అసలే దేశంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా చేజేతులా పవర్ ను పోగొట్టుకునేందుకు రెడీ అయిపోయినట్లు కన్పిస్తుంది. మధ్యప్రదేశ్ లో [more]
అసలే దేశంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా చేజేతులా పవర్ ను పోగొట్టుకునేందుకు రెడీ అయిపోయినట్లు కన్పిస్తుంది. మధ్యప్రదేశ్ లో [more]
అసలే దేశంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా చేజేతులా పవర్ ను పోగొట్టుకునేందుకు రెడీ అయిపోయినట్లు కన్పిస్తుంది. మధ్యప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. మధ్యప్రదేశ్ లో చచ్చీ చెడీ కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ దశాబ్దాల పాటు అక్కడ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ కు ప్లస్ గా మారి విజయం సాధించింది. అయితే వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ నేతలు నిలబెట్టుకోలేకపోతున్నారు.
సీఎం పదవి నుంచి….
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు కొదవలేదు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ తో పాటు సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ లు ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు ఖచ్చితంగా వస్తుందని జ్యోతిరాదిత్య సింధియా ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత గట్టిగా నమ్మారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడంతో తనకు సీఎం పదవి గ్యారంటీ అనుకున్నారు. చివరకు సోనియా ఆశీస్సులతో కమల్ నాధ్ సీఎం పదవిని చేపట్టారు. దీంతో కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ ఒక వర్గంగా, జ్యోతిరాదిత్య సింధియా మరొక వర్గంగా మారి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ను ముక్కలుగా ఇప్పటికే చేసేశారు.
పీసీసీ విషయంలోనూ…..
పీసీసీ పదవి విషయంలోనూ రెండు వర్గాలు గట్టిగానే పోరాడాల్సి వచ్చింది. ఈ కీచులాటల కారణంగానే లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్క ముఖ్యమంత్రి కమల్ నాధ్ కుమారుడు మాత్రమే ఎంపీగా గెలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. ఇందుకు కారణంగా నేతల మధ్య వర్గ విభేదాలే కారణమని అధిష్టానానికి తెలిసినప్పటికీ వారిని ఏకం చేసే ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు.
ముదిరిన వివాదం….
తాజాగా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రిపైనే ఫైరవ్వడం విశేషం. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన మాటలను సింధియా బహిరంగ సభలో చేయడం విశేషం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రెండు లక్షల రుణాన్ని ప్రతి రైతుకు మాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం కేవలం యాభైవేలు మాత్రమే చేసిందని, వెంటనే రుణాలను మాఫీ చేయాలని సింధియా డిమాండ్ చేశారు. అయితే దీనికి ముఖ్యమంత్రి కమల్ నాథ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారమే మాఫీ చేశానని, రెండో దఫాలోనే రుణం మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. ఇలా అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయిందని చెప్పక తప్పదు.