అంచుకు చేరిందా?
డిపాజిట్లు రాకపోతున్నా పార్టీ పరిస్థిితి తెలియడం లేదు. పోనీ ఏమైనా ఇమేజ్ ఉన్న నేతలనుకుంటే అదీ కాదు. కానీ సీనియారిటీ అనే ఒకే పదం వారిలో ఆధిపత్య [more]
డిపాజిట్లు రాకపోతున్నా పార్టీ పరిస్థిితి తెలియడం లేదు. పోనీ ఏమైనా ఇమేజ్ ఉన్న నేతలనుకుంటే అదీ కాదు. కానీ సీనియారిటీ అనే ఒకే పదం వారిలో ఆధిపత్య [more]
డిపాజిట్లు రాకపోతున్నా పార్టీ పరిస్థిితి తెలియడం లేదు. పోనీ ఏమైనా ఇమేజ్ ఉన్న నేతలనుకుంటే అదీ కాదు. కానీ సీనియారిటీ అనే ఒకే పదం వారిలో ఆధిపత్య ధోరణిని నింపుతోంది. కాంగ్రెస్ కు వరస ఓటములు ఎదురవుతున్నా అధికారంలో ఉన్నామని విర్రవీగడం తప్పించి ప్రజామోదం పొందే ప్రయత్నాలు చేయడం లేదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఎవరికైనా చెప్పకనే తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి కాంగ్రెస్ రావడం నిజంగా కలే.
ఆధిపత్య ధోరణితోనేనా?
భారతీయ జనతా పార్టీ పదిహేనేళ్లుగా పాలనలో ఉండటమే కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెబుతున్నారు. సీనియర్ నేతలున్నా వారికి రాష్ట్రం మొత్తం చరిష్మా లేదు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్ వంటి వారు పార్టీ సింబల్ ఆధారంగానే ఇన్నాళ్లూ రాజకీయాలను లాగించేస్తున్నారు. అంతే తప్ప వారికంటూ ప్రత్యేకించి సొంత ముద్రలేదన్నది వాస్తవం. మొత్తం మీద మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చచ్చీ చెడీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదన్నది సుస్పష‌్టం.
ఒకరిపై ఒకరు…..
అయితే గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కమల్ నాధ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియాల మధ్య అంతర్గత యుద్ధం ప్రారంభమయింది. తనకు దక్కాల్సిన సీటును కమల్ నాధ్ చేజిక్కించుకున్నాడని ఎప్పటి నుంచో సింధియా కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతటితో ఆగకుండా వరసగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తానే విపక్షంగా మారి రోడ్డుపైకి వచ్చి ఆందోళనలకు దిగుతానని హెచ్చరిస్తున్నారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పతనమయ్యేందుకు సంకేతంగానే చూడాల్సి ఉంటుంది.
హైకమాండ్ వార్నింగ్ లు కూడా….
ఇక సీనియర్ నేత, ముఖ్యమంత్రి కమల్ నాధ్ కూడా ఏమాత్రం తగ్గడంలేదు. దిగ్విజయ్ సింగ్ తో జతకట్టి సింధియాను పార్టీ, ప్రభుత్వ పరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి విషయంలోనూ ఇదే తంతు. మొత్తం మీద మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ముసలం మొదలయిందనే చెప్పాలి. ఇప్పటికే అధిష్టానం పలుమార్లు వార్నింగ్ లు ఇచ్చినా ఎవరూ సర్దుకుని వెళ్లేందుకు సుముఖత చూపడంలేదు. దీంతో పెద్ద రాష్ట్రం హస్తం నుంచి చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.