అప్పడే స్టార్టయితే ఇక ముందు ముందు?
మహారాష్ట్ర కాంగ్రెస్ లో అసంతృప్తి చెలరేగింది. కూటమిలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు బాహాటంగా ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవలే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమితో ప్రభుత్వం ఏర్పడిన [more]
మహారాష్ట్ర కాంగ్రెస్ లో అసంతృప్తి చెలరేగింది. కూటమిలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు బాహాటంగా ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవలే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమితో ప్రభుత్వం ఏర్పడిన [more]
మహారాష్ట్ర కాంగ్రెస్ లో అసంతృప్తి చెలరేగింది. కూటమిలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు బాహాటంగా ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవలే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమితో ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుంది. ఇక కూటమిలో ఉన్న కాంగ్రెస్ కు స్పీకర్ తో పాటు మరికొన్ని కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తారని హస్తం పార్టీ నేతలు భావించారు.
మంత్రిత్వ శాఖలపైన……
కానీ ఉద్ధవ్ థాక్రేతో ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులకు శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న వాదన విన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, సహకారశాఖ, హౌసింగ్ వంటి వాటిపై ఆశలు పెట్టుకుంది. అయితే కీలక శాఖలను అప్పగించేందుకు శివసేన, ఎన్సీపీలు సిద్ధంగా లేవు. ఉప ముఖ్యమంత్రితితో పాటు మరికొన్ని ముఖ్యమైన శాఖలను కూడా ఎన్సీపీ ఆశిస్తుంది.
ప్రజలతో సంబంధం లేని…..
దీంతో కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాంగ్రెస్ కు కీలక శాఖలు అప్పగించకపోతే పార్టీ మనుగడ కష్టమని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పెద్దలు ఉద్ధవ్ థాక్రేతోనూ, శరద్ పవార్ తోనూ చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రజలతో సంబంధంలేని శాఖలను కేటాయంచడంపై తమ పార్టీలో అసంతృప్తి ఉందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు బాలా సాహెబ్ థోరట్ తెలిపారు.
విస్తరణ జరిగితే…?
మంత్రిత్వ శాఖల్లోనే ఇంత అసంతృప్తి ఉంటే రేపు పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు తమకు మంత్రి పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అందరూ పార్టీని వీడినా తాము నమ్మకంగా ఉన్నామని, తమకు మంత్రిపదవులు కేటాయించాలని అధిష్టానంపై వత్తిడి తెస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కావడంతో ఎక్కువ మందికి అవకాశాలు కల్పించలేమని, విడతల వారీగా అవకాశాలు కల్పిస్తామని హైకమాండ్ వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ లో అసంతృప్తిని బీజపీ క్యాష్ చేసుకుంటుందా? అన్న అనుమానం కూటమిలో బయలుదేరిందనే చెప్పాలి.