నిర్ణయం తీసుకోలేకపోతున్నారా.. తీసుకున్నా వేస్టనేనా?
తెలంగాణ పీసీసీ పై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతుంది. అన్ని రాష్ట్రాలకూ పీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ విషయంలో మాత్రం ఒక [more]
తెలంగాణ పీసీసీ పై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతుంది. అన్ని రాష్ట్రాలకూ పీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ విషయంలో మాత్రం ఒక [more]
తెలంగాణ పీసీసీ పై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతుంది. అన్ని రాష్ట్రాలకూ పీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ విషయంలో మాత్రం ఒక డెసిషన్ కు రాలేకపోతుంది. తెలంగాణకు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా శైలజానాధ్ ను అధ్యక్షుడిగా నియమించింది. మరో పొరుగురాష్ట్రమైన కర్ణాటకు డీకే శివకుమార్ ను పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ నియామకాలు జరిగి నెలలు కావస్తుంది.
మార్పు ఖాయమంటూ…..
అదే సమయంలో తెలంగాణలో పీసీసీ మార్పు తధ్యమని అందరూ ఊహించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పిటికే రెండు ఎన్నికలకు పీసీీసీ అధ్యక్షుడిగా నేతృత్వం వహించారు. రెండు ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను పీసీీసీ బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా విన్నవించారు.
కొత్త నేత వస్తారని…..
ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త నేత వస్తారని ప్రచారం జరిగింది. గత నాలుగు నెలల నుంచి పీసీసీ అధ్యక్ష పదవికి అనేక పేర్లు విన్పించాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి వంటి పేర్లు ఢిల్లీ స్థాయిలో విన్పించాయి. అలాగే జగ్గారెడ్డి వంటి వారు తనకు పీసీీసీ పదవి ఇస్తే చేపడతానని ఢిల్లీ వెళ్లి మరీ చెప్పి వచ్చారు.కరోనా వ్యాప్తి చెందడానికి ముందు ఈ పదవిపై పెద్దయెత్తున లాబీయింగ్ కూడా చేశారు.
ఇది సరైన సమయం కాదని….
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వారిని నియమిస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని, గ్రూపుల గోల ఎక్కువవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. అయితే తెలంగాణలో మరో మూడేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవని, ఇప్పుడు పీసీీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తారన్న వాదన కూడా విన్పిస్తుంది. అయితే పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోక పోవాడనికి ఉత్తమ్ ను కంటిన్యూ చేయాలన్న ఆలోచన కూడా ఉందంటున్నారు.