జానారెడ్డి ఎలా చెబితే అలా చేసేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిని ఎవరికి చెప్పకుండానే సులువుగా అర్థమవుతుంది. ఒక్క పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఏళ్లుగా నానుస్తూ వస్తుంది. గ్రూపు రాజకీయాలే [more]

Update: 2021-01-06 11:00 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిని ఎవరికి చెప్పకుండానే సులువుగా అర్థమవుతుంది. ఒక్క పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఏళ్లుగా నానుస్తూ వస్తుంది. గ్రూపు రాజకీయాలే ఇందుకు ప్రధాన కారణం. పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డిని నియమించారన్న వార్తలు వచ్చాయి. మరికాసేపట్లో అధికార ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం జరిగింది. అయితే అకస్మాత్తుగా మళ్లీ వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఇందుకు కారణం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కారణం.

ఈ లింకేమిటో…?

నిజానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు, పీసీసీ అధ్యక్ష పదవికి ఉన్న లింకు ఏంటో ఎవరికి అర్థం కాదు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సాగర్ ఉప ఎన్నికలో తనకు మరికొందరు సహకరించరన్నది సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయం. తన అభిప్రాయాన్నే జానారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియజేశారు. సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని హైకమాండ్ మన్నించినట్లే కనిపిస్తుంది.

అంత సీన్ ఉందా?

నిజానికి కాంగ్రెస్ పార్టీ నేతల సంగతి తెలిసిన వారెవరైనా అంత సీన్ లేదని పిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ప్రజలను ప్రభావితం చేయగల నేత ఎవరన్న ప్రశ్నకు లేరనే సమాధానం ఠక్కున ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తుంది. అలాంటిది నేతల గ్రూపు విభేదాలకు భయపడి పీసీసీ చీఫ్ పదవిని వాయిదా వేయడం ఎందుకన్న సందేహం కలుగుతుంది. వీహెచ్ బయటకు వెళితే ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి తలెగరేస్తే పార్టీ ఫేట్ మారుతుందా? వంటి వాటికి సమాధానమే లేదు.

అంత బలహీనతా?

తెలంగాణ రాష్ట్రాన్ని సులువుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవి ఎంపికలో మాత్రం తాత్సారం చేస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. జానారెడ్డి సీనియర్ నేత. ఆయనకు అంతా తెలుసు. ప్రతి నేత మనస్తత్వం ఎరిగిన నేత. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి కుటుంబం పోటీ చేయనుంది. ఈ ఎన్నిక జానారెడ్డికి ప్రతిష్టాత్మకం కావడంతో ఎందుకొచ్చిన సమస్యలే అని పీసీసీ చీఫ్ పదవి ని వాయిదా వేయమన్నారు. జానారెడ్డి అనగానే ఓకే అనడం హైకమాండ్ బలహీనతకు నిదర్శనం. ఇక సాధారణ ఎన్నికలు ఈ నేతలు ఎలా ఎదుర్కొంటారన్నది వేయి డాలర్ల ప్రశ్న.

Tags:    

Similar News