జానారెడ్డిని ఆదర్శంగా తీసుకోలేరా? పార్టీకి ప్రాణం పోయలేరా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి యువరక్తం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సీనియర్ నేతలు చాలా మంది రాజకీయంగా రిటైర్ మెంట్ స్టేజీకి వచ్చేశారు. వీళ్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి యువరక్తం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సీనియర్ నేతలు చాలా మంది రాజకీయంగా రిటైర్ మెంట్ స్టేజీకి వచ్చేశారు. వీళ్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి యువరక్తం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సీనియర్ నేతలు చాలా మంది రాజకీయంగా రిటైర్ మెంట్ స్టేజీకి వచ్చేశారు. వీళ్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నడవడం కష్టమే. ఇప్పటికే అనేక మంది నేతలు వరస పరాజయాలతో అన్ని రకాలగా నష్టపోయారు. పోనీ వీరి మీద సానుభూతి ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. అధికారంలోకి వస్తే పదవులు, ఎన్నికలొస్తే టిక్కెట్లను దక్కించుకోవడం కోసమే వీరు పరిమితమవుతున్నారు. ఇదే తెలంగాణ కాంగ్రెస్ కు ప్రధాన సమస్య.
నేతలకు కొదవ లేదు కాని?
తెలంగాణ కాంగ్రెస్ లో నేతలకు కొదవలేదు. పేరు గొప్ప నేతలున్నా ఫలితం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలు తప్ప మరెవ్వరూ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, జానారెడ్డి, షబ్బీర్ ఆలి, వి.హనుమంతరావు, మధు యాష్కి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలున్నా వీరెవ్వరికీ ప్రజాదరణ లేదు. ప్రజా క్షేత్రంలో వీరు వరుస ఓటములు ఎదురవుతున్నా వారి పట్ల సానుభూతి లేదు.
చివరి ఎన్నిక అని చెప్పినా…?
ఇందుకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికే కారణం. జానారెడ్డి ఇదే తన చివరి ఎన్నిక అని ప్రజలకు వివరించినా జానారెడ్డి వైపు ప్రజలు చూడలేదు. అంటే వయసుడిగిపోయి, సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తున్న వారికి ఇక కాలం చెల్లిందనే చెప్పాలి. వీరు ఇక ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం మారదు అన్న కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే విన్పిస్తుంది. అందుకే వీరిని దూరం పెడితే తప్ప పార్టీ బాగుపడదన్న నిర్ణయానికి హైకమాండ్ వచ్చేసిందటున్నారు.
ఆయనను అనుసరిస్తేనే?
అందరూ జానారెడ్డి బాటలోనే కాంగ్రెస్ నేతలు పయనిస్తే బాగుంటుందన్న సూచనలు విన్పిస్తున్నాయి. జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తానని జానారెడ్డి చెప్పారు. మిగిలిన నేతలు కూడా జానారెడ్డిని అనుసరించాలన్న డిమాండ్ విన్పిస్తుంది. వారి స్థానంలో కొత్త వారికి, యువకులకు అవకాశం కల్పిస్తేనే కాంగ్రెస్ కోలుకునే అవకాశాలున్నాయి.