నాయకుడు ఎవరు వచ్చినా అంతే?

తెలంగాణ కాంగ్రెస్ కు ఎవరు నాయకత్వం వహించినా అంతే. ఇక ఆ పార్టీలో మార్పు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్ట వ్యవహారాల ఇన్ [more]

Update: 2020-11-18 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ కు ఎవరు నాయకత్వం వహించినా అంతే. ఇక ఆ పార్టీలో మార్పు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్ట వ్యవహారాల ఇన్ ఛార్జి ని మార్చినా ప్రయోజనం అయితే కన్పించడం లేదు. కాంగ్రెస్ కు తెలంగాణలో భవిష్యత్ లేదన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా మాణికం ఠాగూర్ వచ్చిన తర్వాత కొంత మార్పు వస్తుందని భావించారు. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా….

జాతీయ పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉంది. అయితే నాయకత్వ లేమి, ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం చూరగొనకపోవడంతో అధికారంలోకి రాలేకపోయింది. అయితే 2018 ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకుంటే మరింత పూర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శించిన తీరుకు ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

చెత్త ప్రదర్శనతో…..

కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించకపోవడం ఆ పార్టీ నేతల పనితీరుకు అద్దం పడుతుంది. హడావిడిగా ఒక రోజు ముందు వచ్చిన నేతకు టిక్కెట్ ఇవ్వడం కూడా కొందరి నేతలకు రుచించడం లేదు. అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయం నిర్ణయాలే పార్టీ కొంపను ముంచుతున్నాయంటున్నారు. ఇంత చెత్త ప్రదర్శనను గతంలో ఏ ఎన్నికలో చూపలేదన్న విషయాన్ని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు.

పార్టీని వీడే వారే ఎక్కువ…..

అందుకే పార్టీ నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్ వినపడుతుంది. మధు యాష్కీ వంటి నేతలు పీసీసీ చీఫ్ ను మార్చాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నాయకుడు వచ్చినా చేసేదేమీ లేదు. పూర్తిగా దెబ్బతిన్న పార్టీని పైకి తీసుకురావడం ఏ నేత వల్ల కాదంటున్నారు. పార్టీ నుంచి కూడా ఇక వలసల జోరు కూడా ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ, టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాయకత్వం లేక పూర్తిగా చతికలపడిందనే చెప్పాలి. ఎవరు వచ్చినా కాంగ్రెస్ ను పైకి లేపే అవకాశాలే కన్పించడం లేదు. జనంలో విశ్వాసం కోల్పోయిన పార్టీగా అది మిగిలిపోవాల్సిందే.

Tags:    

Similar News