కాంగ్రెస్ కు కొత్త బాస్ వచ్చినా?
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వచ్చినా ఆయనపై అతిపెద్ద బాధ్యతలు ఉన్నాయి. ప్రధానంగా కొత్త పీసీసీ చీఫ్ మరికొన్ని ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ప్రధానంగా నాగార్జున [more]
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వచ్చినా ఆయనపై అతిపెద్ద బాధ్యతలు ఉన్నాయి. ప్రధానంగా కొత్త పీసీసీ చీఫ్ మరికొన్ని ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ప్రధానంగా నాగార్జున [more]
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వచ్చినా ఆయనపై అతిపెద్ద బాధ్యతలు ఉన్నాయి. ప్రధానంగా కొత్త పీసీసీ చీఫ్ మరికొన్ని ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా ఆయన నేతృత్వంలోనే జరగాల్సి ఉంది. ఈ రెండు ఎన్నికలు కొత్త అధ్యక్షుడికి సవాలుగా మారనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి నేతల మధ్య సమన్వయం కుదిరే అవకాశముంది.
సాగర్ ఉప ఎన్నిక….
అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కొంత కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉండే అవకాశముంది. అక్కడ బలమైన అభ్యర్థిగా జానారెడ్డి ఉండటంతో కొంత కష్టపడితే గెలుపు సులువవుతుంది. నాగార్జున సాగర్ లో బీజేపీ ప్రభావం కూడా పెద్దగా లేకపోవడం కాంగ్రెస్ కు కలసి వచ్చే అంశం. ఈ ఎన్నికను కాంగ్రెస్ చక్కగా వినియోగించుకుంటే పార్టీకి కొంత మేర మళ్లీ ప్రజల్లో ఇమేజ్ పెరిగే అవకాశముంది. అభ్యర్థి ఎంపిక కూడా కష్టం కాకపోవడంతో ఈ ఎన్నిక కొత్త పీసీసీ అధ్యక్షుడికి సులువనే చెప్పాలి.
రెండు కార్పొరేషన్ ఎన్నికలు…..
కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి పాలయితే మాత్రం కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో కోలుకోలేనట్లే. ఇందుకోసం సర్వశక్తులు కొత్త పీసీసీ చీఫ్ ఒడ్డాల్సి ఉంటుంది. ఇక వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా కొత్త పీసీసీ చీఫ్ కు సవాల్ గానే చెప్పుకోవాలి. ఇందులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొంత కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. అక్కడ కొంత కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ గా ఉండటం, ఓటు బ్యాంకు వల్లనే కొంత అడ్వాంటేజీ ఉంది.
రానున్న సాధారణ ఎన్నికలకు…..
ఇక ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ కు కష్టమే. ఇక్కడ టీఆర్ఎస్ కొంత బలంగా ఉండటమే కారణం. ఈ ఎన్నికలు 2023లో వచ్చే ఎన్నికలకు సూచిక కావడంతో ఇప్పుడు కొత్తగా వచ్చే పీసీసీ చీఫ్ కు ఇబ్బందిగా మారనుంది. అయితే కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద కొత్తగా వచ్చే పీసీసీ చీఫ్ పై మోయలేని బాధ్యతలు ఉన్నాయి. వీటి నుంచి ఆయన బయటపడాల్సి ఉంటుంది.