ముసిలోళ్లు… ముంచేస్తున్నారు.. అర్థం కావడం లేదా?
కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పట్లో కోలుకోలేదు. దీనికి కారణం స్వయంకృతాపరాధమే. సీనియర్ నేతలు పదవుల కోసం, పోటీలో తామున్నామంటూ ముందుకు రావడంతో యువకులకు అవకాశం లేకుండా పోతుంది. [more]
కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పట్లో కోలుకోలేదు. దీనికి కారణం స్వయంకృతాపరాధమే. సీనియర్ నేతలు పదవుల కోసం, పోటీలో తామున్నామంటూ ముందుకు రావడంతో యువకులకు అవకాశం లేకుండా పోతుంది. [more]
కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పట్లో కోలుకోలేదు. దీనికి కారణం స్వయంకృతాపరాధమే. సీనియర్ నేతలు పదవుల కోసం, పోటీలో తామున్నామంటూ ముందుకు రావడంతో యువకులకు అవకాశం లేకుండా పోతుంది. సీనియర్లు ఉన్నంత వరకూ తమకు పదవులు రావని ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీలను చూసుకుంటున్నారు.
అంతా సీనియర్లే…..
పాచిపోయిన మొహాలు, వెగటుపుట్టించే ఉపన్యాసాలతో దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్న వారినే కాంగ్రెస్ నమ్ముకుంది. అదే దాని కొంప ముంచుతుంది. రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస నాలుగు, ఐదో స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంత దుస్థితి దాపరించడానికి యువనేతలను ప్రోత్సహించకపోవడమే.
చిన్నారెడ్డికి ఏం తక్కువ?
రెండు పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ హై కమాండ్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ గాంధీ భవన్ లో కూర్చుని ఇద్దరు సీనియర్ నేతలను ఎంపిక చేసింది. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఎంపిక చేసింది. చిన్నారెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వకపోతే పోయేదేమీ ఉండదు. కొత్త వారికి అవకాశం కల్పించి ఉంటే కొద్దో గొప్పో ప్రభావం చూపేవారు. ఓటమి పాలయిన తర్వాత చిన్నారెడ్డి ఇక తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయనని శపథం చేశారు.
వారు తప్ప ఎవరూ లేరా?
ఇక నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి రాములు నాయక్ ను ఎంపిక చేసింది. ఇదీ అంతే. గతంలో పోటీ చేసి ఓటమి పాలయిన తీన్మార్ మల్లన్నను పక్కన పెట్టింది. ప్రజలు రాములు నాయక్ వైపు చూడలేదు. తీన్మార్ మల్లన్న వైపే చూశారు. ఏ ఎన్నిక వచ్చినా తామున్నామంటూ సీనియర్లు ముందుకు రావడం, పీసీసీ పదవుల్లో ఉన్నవారు ఓకే చెప్పడంతో కాంగ్రెస్ కు ప్రజలు పాడె కడుతున్నారు. ఇప్పటికైనా సీనియర్ నేతలను పక్కన పెట్టి యువనేతలను ప్రోత్సహిస్తేనే కాంగ్రెస్ కు కొద్దోగొప్పో భవిష‌్యత్ ఉంటుంది.