మోడీ కొట్టిన దెబ్బకు ఇంకా షాక్ లోనే కాంగ్రెస్

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైన లోక్ సభలో కాంగ్రెస్ పక్షాన నాయకుడు ఎవరో ఇంకా తేలలేదు. బిజెపి సర్కార్ రెండోసారి భారీ మెజారిటీ తో దూసుకురావడంతో షాక్ [more]

Update: 2019-06-18 04:30 GMT

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైన లోక్ సభలో కాంగ్రెస్ పక్షాన నాయకుడు ఎవరో ఇంకా తేలలేదు. బిజెపి సర్కార్ రెండోసారి భారీ మెజారిటీ తో దూసుకురావడంతో షాక్ లోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో తమ పార్టీ తరపున నాయకులు ఎవర్ని నియమించాలో తేల్చుకోలేకపోతుంది. లోక్ సభ, రాజ్యసభల్లో అనేక పదవులపై ఇంకా కాంగ్రెస్ పార్టీ లో క్లారిటీ లేదు. కాంగ్రెస్ ఘోరఓటమికి నైతిక బాధ్యత వహించి సారధ్య బాధ్యతలనుంచి తప్పుకుంటానన్న రాహుల్ గాంధీ ని బుజ్జగించడంతోనే ఆ పార్టీ కాలం గడిచిపోతుంది. గత 16 వ లోక్ సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కి మల్లిఖార్జున ఖర్గే నేతృత్వం వహించారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలిసి వుంది. అయితే అధిష్టానం ఇప్పటివరకు ఆ ప్రక్రియ చేపట్టకపోవడం చర్చకు దారితీస్తుంది.

మనీష్ తివారీకి ఛాన్స్ ...

గాంధీల కుటుంబానికి వీర విధేయులుగా ఉండాలి. వారికి ఆంగ్లం, హిందీ భాషలపై పట్టు ఉండాలి. ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవారినే కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసే వీలుంటుందని పార్టీ వర్గాల సమాచారం. రాహుల్ ఒప్పుకుంటే ఆయనకే సామర్ధ్య బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే పార్టీలోని అన్ని వర్గాలనుంచి వత్తిడి పెరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచే పోతా అంటున్న రాహుల్ దీనికి అంగీకరించే అవకాశాలు బహు తక్కువనే టాక్ వినవస్తుంది.మరోపక్క రాహుల్ కాకపోతే పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న మనీష్ తివారి, పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అజయ్ రంజన్ చౌదరి, శశిథరూర్, కేరళ నుంచి కె. సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో శశిథరూర్ కి సునంద పుష్కర్ కేసు కారణంగా ఛాన్స్ దక్కదని అంటున్నారు. మనీష్ తివారికే పదవి వరించే అవకాశాలు విన్నాయంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News