ఎవరో ఒకరు రావాల్సిందే?
వరస ఓటములు… ఇప్పటి వరకూ విజయం అనే మాట లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే స్థాయి నేతలే పార్టీ నుంచి వెళ్లిపోయిన సందర్భాలను చూశాం. ఇక బలమైన [more]
వరస ఓటములు… ఇప్పటి వరకూ విజయం అనే మాట లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే స్థాయి నేతలే పార్టీ నుంచి వెళ్లిపోయిన సందర్భాలను చూశాం. ఇక బలమైన [more]
వరస ఓటములు… ఇప్పటి వరకూ విజయం అనే మాట లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే స్థాయి నేతలే పార్టీ నుంచి వెళ్లిపోయిన సందర్భాలను చూశాం. ఇక బలమైన క్యాడర్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో నిలదొక్కుకోలేకపోతోంది. నిలదొక్కుకోలేకపోవడమే కాదు ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పక తప్పదు.
ఏ ఎన్నికల్లోనూ….
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఎలాంటి విజయాలను సాధించలేదు. 2014, 2018 ఎన్నికల్లో పూర్తిగా చతికలపడింది. తర్వాత జరిగిన జడ్పీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. మొత్తం అధికార టీఆర్ఎస్ వైపునకు జడ్పీ పీఠాలు వెళ్లిపోయాయి. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. అధికార పార్టీ ధన ప్రవాహంతో తాము ఓటమిపాలయ్యామని పార్టీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేకనే ఆదరించడం లేదన్నది వాస్తవమని అంగీకరించక తప్పదు.
అట్టర్ ప్లాప్ లతో…..
మున్సిపల్ ఎన్నికల్లో పేరున్న నేతల ఇలాకాలో కూడా కాంగ్రెస్ పూర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే సింగిల్ డిజిట్ కే కాంగ్రెస్ పరిమితం కావడం కలవరమే. పీసీసీ చీఫ్ సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ చతికలపడింది. సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ ఆలి, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి వంటి నేతలు తమ ప్రాంతాల్లోనూ పార్టీని గెలిపించుకోలేకపోయారు. దీంతో క్యాడర్ లో ఆందోళన మొదలయింది. దీనికి కారణం పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక కారణమని చెప్పక తప్పదు.
పార్టీని వీడటమే బెస్ట్…..
ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతల్లో ప్రారంభమయింది. కాంగ్రెస్ ఇక ఎప్పటికీ కోలుకోలేదన్న పరిస్థితికి అగ్రనాయకులు తెచ్చారంటున్నారు. పదవుల కోసం నిత్యం కొట్లాడుకోవడం, గాంధీ భవన్ దాటి నేతలు రాకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్ లేదన్న ఆందోళనను అంతర్గత సమావేశాల్లో సీనియర్ నేతలు వెలిబుచ్చుతున్నారంటే ఇక చేతులెత్తేసినట్లేనని చెప్పవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఎవరో ఒకరు రావాల్సిందేనని నిరీక్షించక తప్పదు.