వారి రూట్ లోనే వీరు కూడా?

సీల్డ్ కవర్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా దేశంలో నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ మాత్రం కీలక నిర్ణయం అయినా అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ లో [more]

Update: 2020-06-12 16:30 GMT

సీల్డ్ కవర్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా దేశంలో నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ మాత్రం కీలక నిర్ణయం అయినా అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ లో పార్టీ నిర్ణయం వచ్చేస్తుంది. ఈ సంస్కృతిని ఎంతోకాలంగా కమలనాధులు ఎద్దేవా చేస్తూ వచ్చేవారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పేరు తో జరిగేది నియంతృత్వ ధోరణి అంటూ పెద్ద ఎత్తునే విమర్శలు చేస్తూ వచ్చేవారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాధులు సైతం కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కి తెరతీశారు. అదే బెస్ట్ అనే రీతిలో వారి అడుగులు పడుతున్నాయి.

యడ్డీకి షాక్ ఇచ్చిన కమలం అధిష్టానం …

దేశంలో లాక్ డౌన్ దెబ్బకు వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలు తాజాగా తిరిగి నిర్వహిస్తున్నారు. ఈనెల 19 న పెద్దల సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కర్ణాటక లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాలిసి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి యడ్యూరప్ప రమేష్ కత్తి, ప్రకాష్ శక్తి, ప్రభాకర్ కోరే లను ఎంపిక చేసి అధిష్టానం ముందు లిస్ట్ పెట్టారు. అయితే ఈ లిస్ట్ ను పక్కన పెట్టి అధిష్టానం ఎంపిక చేసిన పేర్లను వెల్లడించి సొంత పార్టీకి విపక్షానికి సైతం షాక్ ఇచ్చింది బిజెపి. రాయచూర్ జిల్లా నేతగా ఉన్న అశోక్ జాస్తి, బెల్గామ్ రూరల్ అధ్యక్షుడు ఎరన్న భీమప్ప లను ఎంపిక చేసింది కమలం.

క్షేత్ర స్థాయిలో ఉన్నవారికి అందలం …

క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రయోజనాలు కాపాడేవారికి గుర్తింపు ఇవ్వాలనే అధిష్టానం ఈ పని చేసినట్లు రాష్ట్ర నేతలు సమర్ధించుకుంటున్నారు. కొందరు అధిష్టానం ఎంపిక చేసినవారు ఎవరో కూడా తెలియదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా చేసేది ఏమి లేదని అనుకుంటూ ఉండటం విశేషం. మొత్తానికి కాంగ్రెస్ పాలిటిక్స్ నే బిజెపి ఫాలో అవుతున్నట్లు మాత్రం స్పష్టం అవుతుంది. మరోపక్క కాంగ్రెస్ జెడిఎస్ తో బంధం తెగిపోకుండా ఉండేందుకు రెండు స్థానాల్లో ఒకటి మాజీ ప్రధాని దేవెగౌడ కు కేటాయించింది. ఆయన దీనికి తొలుత అంగీకరించకపోయినా సోనియా గాంధీ వత్తిడితో చివరికి ఎస్ అనక తప్పలేదు.

Tags:    

Similar News