ఇక వాళ్లే దిక్కు… ఎవరూ ఇటు చూడటంలేదే?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు దిక్కుమొక్కూ లేకుండా పోయింది. కనీసం జెండా పట్టుకునే వారే కరువయ్యారు. కొత్త పీసీసీ చీఫ్ ను నియమించి దాదాపు ఏడాది గడుస్తున్నా [more]
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు దిక్కుమొక్కూ లేకుండా పోయింది. కనీసం జెండా పట్టుకునే వారే కరువయ్యారు. కొత్త పీసీసీ చీఫ్ ను నియమించి దాదాపు ఏడాది గడుస్తున్నా [more]
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు దిక్కుమొక్కూ లేకుండా పోయింది. కనీసం జెండా పట్టుకునే వారే కరువయ్యారు. కొత్త పీసీసీ చీఫ్ ను నియమించి దాదాపు ఏడాది గడుస్తున్నా ఏమాత్రం ఫలితం కన్పించడం లేదు. వేళ్ల మీద లెక్కపట్టగలిగే నేతలే మనకు కన్పిస్తున్నారు. సీనియర్ నేతలందరూ ముఖం చాటేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ సాకే శైలజానాధ్ అప్పుడప్పుడూ పర్యటిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీకి ఉత్సాహం మాత్రం రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం నాయకత్వ లోపంతో పాటు కాంగ్రెస్ పట్ల ఇంకా ప్రజల వైఖరి మారకపోవడమే.
ఎవరూ ముందుకు రాక….
పీసీసీ చీఫ్ గా సాకే శైలజానాధ్ బాధ్యతలు చేపట్టి పది నెలలు దాటి పోయింది. అయితే ఇప్పటి వరకూ ఏపీలోని 175 నియోజకవర్గాలకు బాధ్యులే లేరు. జిల్లా పార్టీ కార్యాయాలు ఉన్నప్పటికీ వాటికి తాళాలు తీసే వారే లేరు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారు పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదు. ఒకవైపు బీజేపీ ఏపీలో దూసుకు వస్తుంది. అయినా సరే కాంగ్రెస్ నేతల్లో మాత్రం చలనం కన్పించడం లేదు.
సీనియర్ నేతలున్నా….
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా లేనట్లే అనిపిస్తున్నారు. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయనట్లే కన్పిస్తుంది. ఏపీలో ఇంత రగడ జరుగుతున్నా ఆయన మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇక మాజీ ఎంపీలు పల్లంరాజు, జేడీ శీలం, టి.సుబ్బరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు వంటి నేతలు సయితం పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
వారసులకే బాధ్యతలు….
దీంతో కాంగ్రెస్ లో అనేక నియోజకవర్గాల్లో నాయకత్వం లేకపోవడంతో ఉన్న నేతలు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు.మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తన వారసులకు పార్టీ పగ్గాలు అప్పగించారు. తిరుపతి నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుమారుడు చింతా భరత్ ను, మహిళా తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కుమార్తె చింతా నీనాను నియమించారు. అంటే పార్టీ పదవులను చేపట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతోనే తమ కుటుంబ సభ్యులను నియమించుకునే పరిస్థితి ఏర్పడింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.