కాంగ్రెస్ లో అంతేగా.. అంతేగా…?

కాంగ్రెస్ పార్టీలో అంతే. హైకమాండ్ అనుకున్నట్లుగానే జరుగుతుంది. రాష్ట్ర నేతలు తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని భావిస్తారు. కానీ అది భ్రమ మాత్రమే. హైకమాండ్ లెక్కలు దానికున్నాయి. [more]

Update: 2020-06-22 17:30 GMT

కాంగ్రెస్ పార్టీలో అంతే. హైకమాండ్ అనుకున్నట్లుగానే జరుగుతుంది. రాష్ట్ర నేతలు తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని భావిస్తారు. కానీ అది భ్రమ మాత్రమే. హైకమాండ్ లెక్కలు దానికున్నాయి. అందుకే కాంగ్రెస్ లో ఎదుగుదల ఉండదని అనేక మంది నేతలు వాపోతుంటారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా పదవులు ఉన్న వారినే పదవులు వరించడం కాంగ్రెస్ లో ఆనవాయితీ. ఇందుకు కర్ణాటక శాసనమండలి ఎన్నికలు మరో ఉదాహరణ.ః

రెండు స్థానాలకు…..

కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశమంుంది. శాసనసభ్యుల చేత ఎన్నికోబడతారు కాబట్టి సంఖ్యాబలాన్ని పట్టి గెలుచుకుంటారు. ఇప్పడు ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు కాలపరిమితి రెండేళ్లే ఉన్నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కువ మంది పోటీ పడ్డారు. దాదాపు నలభై మంది పోటీలో ఉండగా ఆ జబితాను రాష్ట్ర నాయకత్వం పార్టీ హైకమాండ్ కు పంపింది.

ఇద్దరిని ఎంపిక చేసి….

అయితే హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఝలక్ ఇచ్చింది. జాబితాలో ఉన్న పేర్లను కూడా తాము అనుకున్న పేర్లను ఖరారు చేసుతూ రాష్ట్ర నాయకత్వానికి పంపింది. బీకే హరిప్రసాద్, నజీర్ అహ్మద్ పేర్లకు కాంగ్రెస్ అధినాయకత్వం టిక్ పెట్టింది. దీంతో రాష్ట్ర నాయకులు కంగు తిన్నారు. ఒకరకంగా కాంగ్రెస్ లో గ్రూపులుగా ఉన్న వారికి ఇది షాకింగ్ అంశమే. ఇద్దరిలో ఎవరి గ్రూపుకు కాకుండా తాము అనుకున్న వారిని ఎంపిక చేసింది.

ఇద్దరూ పదవులు అనుభవించిన వారే….

పోనీ కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసిన ఇద్దరు నేతలు పదవులకు కొత్తేమీ కాదు. బీకే హరిప్రసాద్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉ్నారు. ఆయన పదవీకాలం ఈనెల 30వ తేదీతో పూర్తవుతుంది. గత లోక్ సభ ఎన్నికల్లోనూ బీకే హరిప్రసాద్ బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ఇన్ ఛార్జిగా ఉన్నారు. మరో సభ్యుడు నజీర్ అహ్మద్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. పదవులు అనుభవించిన వారికే తిరిగి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. అనేక మంది ఆశావహులు ఎంపికను తప్పుపడుతున్నారు.

Tags:    

Similar News