గెలుపు కష్టమే అయినా… కసరత్తు మాత్రం?

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ కు సవాల్ గా మారనున్నాయి. రెండు చోట్ల అభ్యర్థుల ఎంపికపైనే కాంగ్రెస్ ఇంకా కసరత్తులు పూర్తి చేయలేదు. ఎక్కువ మంది [more]

Update: 2021-02-01 09:30 GMT

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ కు సవాల్ గా మారనున్నాయి. రెండు చోట్ల అభ్యర్థుల ఎంపికపైనే కాంగ్రెస్ ఇంకా కసరత్తులు పూర్తి చేయలేదు. ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారింది. దీంతో పార్టీ హైకమాండ్ అభ్యర్థుల ఎంపికకు సీనియర్ నేతలతో స్క్రీనికంగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల నేతల అభిప్రాయాలను సేకరించిన తర్వాత హైకమాండ్ కు నివేదిక అందిస్తుంది.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు….

తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉండటంతో బలంగా లాబీయింగ్ చేస్తున్నారు.

కోదండరామ్ కు….?

ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను నిలబెడతారా? లేదక కోదండరామ్ కు మద్దతిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. కోదండరామ్ కు మద్దతివ్వాలని ఒక వర్గం, అవసరం లేదని మరొక వర్గం కాంగ్రెస్ లో గత కొద్దికాలంగా వాదిస్తూ వస్తుంది. ఇప్పటికే కోదండరామ్ ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయనకు మద్దతిస్తేనే మంచిదని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. కానీ క్యాడర్ డీలా పడకూడదంటే అభ్యర్థులను నిలపాల్సిందేనని మరికొందరు వాదిస్తున్నారు.

ఏడుగురు సీనియర్లతో…..

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఏడుగురు సీనియర్లతో కూడిన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, అజారుద్దీన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరందరూ పోటీలో ఉన్న పేర్లను పరిశీలించి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతుంది.

Tags:    

Similar News