కాంగ్రెస్ లో ఆజాద్ ప్రస్థానం ముగిసినట్లే?

కాంగ్రెస్ పార్టీలో ఊహించినట్లుగానే జరుగుతోంది. థిక్కార స్వరం విన్పించిన వారిని కట్టడి చేయడానికి, పక్కకు తప్పించే పనిలో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇటీవల సోనియాగాంధీకి 23 [more]

Update: 2020-08-28 18:29 GMT

కాంగ్రెస్ పార్టీలో ఊహించినట్లుగానే జరుగుతోంది. థిక్కార స్వరం విన్పించిన వారిని కట్టడి చేయడానికి, పక్కకు తప్పించే పనిలో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇటీవల సోనియాగాంధీకి 23 మంది సీనియర్ నేతలు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక్కొక్కరికి పదవులకు ఎసరు పెట్టే విధంగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా పెద్దల సభలో గులాం నబీ ఆజాద్, ఆనందశర్మ లకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేసింది.

వివరణ ఇచ్చినప్పటికీ…..

ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు 23 మంది సీనియర్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఘాటు లేఖ రాశారు. ఈ లేఖను సీనియర్లందరూ సమర్థించుకున్నారు. తాము పార్టీ బలోపేతానికే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమకు పార్టీ వీడే ఆలోచన లేదని, తాము కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు కట్టబడే పనిచేస్తామని చెప్పుకొచ్చారు. అయినా సోనియా, రాహుల్ గాంధీలు వారి వివరణలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.

కంట్రోల్ చేయడానికి…..

రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగించకపోయినా, ఆయనను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంది. రాజ్యసభలో చర్చించాల్సిన విషయాలపై ఖరారు చేేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీని నియమించింది. సోనియా, రాహుల్ కు అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ ఆదేశాల మేరకే ఆజాద్ నడుచుకోవాల్సి ఉంది. పెద్దల సభలో ఏ అంశాలను చర్చించాల్సిందీ ఈ కమిటీనే నిర్ణయిస్తుంది. అంటే రాజ్యసభలో ఉన్న గులాం నబీ ఆజాద్ తోపాటు ఆనందశర్మ కూడా డమ్మీలుగా మారిపోనున్నారు.

పదవి కూడా డౌటే….

ఇది తొలి అడుగేనని, త్వరలో గులాం నబీ ఆజాద్ విపక్ష నేత పదవి ఊడిపోవడం ఖాయమన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. ఇది తెలిసిన గులాం నబీ ఆజాద్ మరో ఘాటు లేఖ రాయడం విశేషం. పార్టీని ఇలానే నడిపితే మరో యాభై ఏళ్లు విపక్షంలోనే ఉండాలని ఆజాద్ సీరియస్ కామెంట్స్ చేశారు. లోక్ సభలో శశిధరూర్, మనీశ్ తివారిలను కట్టడి చేసేందుకు లోక్ సభ ఉపనేత గౌరవ్ గొగయ్, విప్గ ా రణవీత్ సింగ్ బిట్టూను నియమించారు. వీరు కూడా గాంధీ కుటుంబం వీర విధేయులే. మొత్తం మీద మూడురోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం తలెగరేసిన వారిని కంట్రోల్ చేసే చర్యలు ప్రారంభించిందనే చెప్పాలి.

Tags:    

Similar News