కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే… ప్రకటించిన వైసీపీ

జగన్ ప్రభుత్వం పెద్దయెత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వైసీపీ నేతలకు పదవులను కేటాయించారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. [more]

Update: 2021-07-17 07:28 GMT

జగన్ ప్రభుత్వం పెద్దయెత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వైసీపీ నేతలకు పదవులను కేటాయించారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో యాభైశాతం పోస్టులకు మహిళలకు కేటాయించారు. 135 కార్పొరేషన్ లలో 76 ఛైర్మన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. 59 ఓసీలకు కేటాయించారు. 56 శాతం వెనకబడిన తరగతులకు జగన్ కేటాయించారు. రాజకీయ చరిత్రలోనే ఇది చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టులను హోంమంత్రి సుచరిత, వెనకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణలు ప్రకటించారు.

ఏపీ స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ – బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
ఏపీ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ – నార్తు రామారావు
ఏపీఐఐసీ ఛైర్మన్ – మెట్టు గోవర్థన్ రెడ్డి
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ – అడపా శేషగిరి
విద్యా విభాగం అభివృద్ధి ఛైర్మన్ – మళ్ల విజయప్రసాద్ (మాజీ ఎమ్మెల్యే)
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ – సుధాకర్
క్రిస్టియన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ – జాన్ వెస్లీ
ఏపీ ఎండీసీ ఛైర్మన్ – సమీమ్ అస్లాం (మదనపల్లి)
కాకినాడ అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ – రాగిరెడ్డి చంద్రకళ దీప్తి
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ – దవులూరి దొరబాబు
కాకినాడ స్మార్ట్ సిటీ డెవలెప్ మెంట్ ఛైర్మన్ – అల్లి రాజబాబు
వీఎంర్డీఏ ఛైర్మన్ – అక్రమాని విజయనిర్మల

ఎపీ సివిల్ సప్లయ్ కార్పోరేషన్- ద్వారంపూడి భాస్కర రెడ్డి

నుడా చైర్మన్ – ముక్కాల ద్వారకానాథ్
నెల్లూరు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ – తాటి వెంకటేశ్వర్లు

ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ – విఎస్ గౌస్

గిరిజన కార్పొరేషన్ – పసుపులేటి బాలరాజు
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ – సర్రాజు
ఏపీ ఫారెస్ట్ డెవలెప్ మెంట్ – మేకతోక అరుణ్ కుమార్

Tags:    

Similar News