దోస్త్ మేరా దోస్త్ అంటున్న జగన్ మోహన్ రెడ్డి

వయసు చిన్నదే కానీ బాధ్యత పెద్దది అన్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో. కానీ జగన్ తన బాధ్యతలను [more]

Update: 2019-06-17 00:30 GMT

వయసు చిన్నదే కానీ బాధ్యత పెద్దది అన్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో. కానీ జగన్ తన బాధ్యతలను చక్కగా నెరవేర్చగలరు అంటూ ఆయనే కితాబు ఇచ్చారు. నిజంగా ఇది నిజమని జగన్ నిరూపిస్తున్నారు. జగన్ కి ఏమి అనుభవం ఉంది అన్నవారికి జగన్ ఆచరణలో తానెంటి అన్నది జగన్ చేసి చూపిస్తున్నారు. మంత్రి వర్గం కూర్పు కానీ, సంక్షేమ పధకాల అమలు కానీ, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఎక్కడికక్కడ జగన్ మోహన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక రాజకీయ సంబంధాల విషయంలోను జగన్ మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. వైసీపీ పెద్ద మెజారిటీతో నెగ్గగానే జగన్ తెలంగాణ సీఎం కేసీయార్ ని కలిసి వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా ఉంటున్నారు

పొరుగుతో పొత్తు :

ఇక మరో వైపు తమిళనాడు కు చెందిన డీఎంకే అధినేత స్టాలిన్ ని తమ ప్రమాణ స్వీకారానికి పిలిచిన జగన్ ఆ రాష్ట్రంతోను సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాలనుకుంటున్నారు. మరో వైపు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తోను జగన్ మోహన్ రెడ్డి చేతులు కలిపారు. జగన్ ఢిల్లీ పర్యటనలో కుమారస్వామితో భేటీ కావడం విశేషం. ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర అవసరాలు, రాష్ట్ర రాజకీయాలు, జలవనరులకు సంబంధించిన వివాదాలు పరిష్కారంపై స్థూలంగా చర్చలు జరిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోను జగన్ భేటీ కావాలనుకుంటున్నారు. పోలవరం తో పాటు, సరిహద్దు జిల్లాల నీటి ప్రాజెక్టుల వివాదాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో ఒడిషా ముఖ్యమంత్రి తో ఎపుడు భేటీ కాకపోవడం ఈ సందర్భంగా గమనార్హం.

ఐక్యత తోనే సాధన :

తన ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ పొరపాట్లు గమనంలోకి తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆ తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండడం ద్వారా ఏపీకి న్యాయం చేసుకోవాలన్న తపన జగన్ లో ఉన్నట్లుగా ఉంది. అదే సమయంలో ప్రత్యేక హోదా సాధన జగన్ కి ఇపుడు పెద్ద సవాల్ గా మారింది. కేంద్రంలో బండ మెజారిటీతో అధికారంలో ఉన్న బిజెపి కళ్ళలో పడాలంటే తన బలం ఒక్కటే సరిపోదని, ఇరుగు పొరుగు రాష్టాలతో కలసి అడుగులు వేస్తే కొంత అయిన వ్యవహారం సానుకూలం అవుతుందన్నది జగన్ అంచనగా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కు తమిళ నాడు, ఒడిషా తెలగాణ అడ్డు పడుతున్నాయి. ముందుగా వారితో సఖ్యతగా ఉంటే మిగిలిన కధ కేంద్రంతో దోస్తీ కట్టి జరిపించుకోవచ్చునని జగన్ రాజకీయ వ్యూహం గా ఉంది. మొత్తానికి జగన్ వైఖరి సుస్పష్టం . ఘర్షణలకు చెల్లు చీటి పాడి సహకారమే మంత్రంగా ముందుకు సాగుతున్నారు. ఓ విధంగా ఇది మంచి విధానం అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News